Miss World 2025 Opal Suchata: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ సుందరి ఒపల్ సుచత చువాంగ్‌శ్రీ నిలిచింది. థాయిలాండ్‌లోని ఫుకెట్‌లో 2003లో మార్చి 20వ తేదీన జన్మించింది. అయితే థాయ్‌లాండ్ నుంచి మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన మొదటి అమ్మాయిగా సుచత రికార్డు సృష్టించింది. మిస్ వరల్డ్ 2025గా విజేతగా నిలిచిన ఈ సుందరీకి అడిగిన ప్రశ్నలు ఏంటని చాలా మంది ఎదురు చూస్తుంటారు. పోటీల్లో ఉన్నవారు విజేత ఎవరని ఎదురు చూస్తే మిగతా వారు ఆ ప్రశ్న ఏంటని చూస్తుంటారు. నిజానికి మిస్ వరల్డ్ పోటీలు అంటే చాలా మంది కేవలం అందం మాత్రమే చూస్తారని భావిస్తారు. కానీ కేవలం అందం మాత్రమే కాకుండా వ్యక్తిత్వం, సమాజానికి చేసే సేవ, వారి ఆలోచన తీరు అన్నింటిని కూడా చూసి మిస్ వరల్డ్ విజేతను ప్రకటిస్తారు. అయితే ప్రతీ మిస్ వరల్డ్ విజేతకు ఫైనల్ రౌండ్‌లో ఒక ప్రశ్న ఉంటుంది. అందులో ఎవరైతే సరైన సమాధానం ఇస్తారో వారికే మిస్ వరల్డ్ కిరీటం అందిస్తారు. అయితే మిస్ వరల్డ్ 2025 విన్నర్‌గా నిలిచిన థాయిలాండ్ ఓపల్ సుచాతను అడిగిన ప్రశ్న ఏంటి? ఆమె ఇచ్చిన సమాధానం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఓపల్ సుచాతని విన్నర్‌గా నిలిపింది కేవలం ప్రశ్న, సమాధానం మాత్రమే కాదు. ఆమె అందం, ఆత్మస్థైర్యం. ధైర్యం, నమ్మకం, సమాజం పట్ల ఉన్న బాధ్యత, సహాయం చేయాలనే గుణం అన్ని కూడా ఆమెను మిస్ వరల్డ్ విజేతగా నిలిపిందని చెప్పవచ్చు. అయితే 108 మంది అందగత్తెల్లో ఓపల్ సుచాత విన్నర్‌గా నిలవడానికి చివరగా చెప్పిన సమాధానం. అయితే ఓపల్ సుచాతకి జడ్జ్‌గా ఉన్న సోనూసూద్ చివరిగా ప్రశ్న వేశారు. నిజానికి సంబంధించి, వ్యక్తిగత బాధ్యతకి సంబంధించి కథలను రూపొందించడానికి మీరు నేర్పించిన జర్నీ ఏంటని అడిగారు.
దీనికి ఓపల్ స్పందిస్తూ.. నన్ను ఈ ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు. ఈ స్టే్జ్‌పై ఉండటం కూడా తనకు జీవితంలో లభించిన గొప్ప అవకాశం అని ఒపల్ తెలిపింది. అలాగే మిస్ వరల్డ్‌లో తాను నేర్పుకున్న విషయం పర్యాటకులను ఆకర్షించే బాధ్యత అని తెలిపింది. ఇక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ కూడా జీవితంలో అందరిచేత గౌరవంగా చూసే వ్యక్తిగా ఉండాలి అని తెలిపింది. ఎలాంటి వారికైనా కూడా ఒక వ్యక్తి ఉంటారు. చిన్న పిల్లవాడు లేదా పెద్దవాడు అయినా కూడా గౌరవంగా చూడాలి. అలాగే ప్రజలను ముందుకు నడిపించడానికి ఎల్లప్పుడు కూడా అందరూ దయతో ఉండాలని, మన చుట్టూ ఉన్న వారికి మనం చేసే ఉత్తమమైన పని ఇదేనని తెలిపింది. అయితే ఈమె చెప్పిన సమాధానం, సేవా భావం, బాధ్యత, సాయం చేయాలనే గుణం అన్ని కూడా ఆమెను విన్నర్‌గా నిలిపాయి.