Homeట్రెండింగ్ న్యూస్Minister Roja- Dubai Vacation: దుబాయ్ ఎడారిలో తన సరదాలు అన్నీ తీర్చుకున్న మంత్రి రోజా

Minister Roja- Dubai Vacation: దుబాయ్ ఎడారిలో తన సరదాలు అన్నీ తీర్చుకున్న మంత్రి రోజా

Minister Roja- Dubai Vacation: రోజా ఎన్నో స్థాయిలు దాటుకుని మంత్రి పదవి చేపట్టారు. సినిమాల్లో హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు కూడా ఎంతో శ్రమించారు. ప్రేమతపస్సులో ప్రవేశం చేసినా తరువాత సర్పయాగంలో నటించినా ఆమెకు బ్రేకునిచ్చింది మాత్రం సీతారత్నం గారి అబ్బాయి. ఇలా ఆమె తన కెరీర్ మొదట్లోనే ఎంతో కష్టపడ్డారు. ఒక దశలో ఎందుకు సినిమాల్లోకి వచ్చానురా అని నిట్టూర్చిన సంఘటనలు సైతం లేకపోలేదు. నిర్మాతగా కూడా మారినా దానికి చేసిన అప్పులు తీర్చేందుకు నానా తిప్పలు పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె తన ప్రస్థానాన్ని కొనసాగించేందుకు కష్టాలు పడాల్సి వచ్చిందని తెలుస్తోంది.

Minister Roja- Dubai Vacation
Minister Roja

రాకీయాల్లో చేరాక కూడా నిలదొక్కుకునేందుకు ఎన్నో తంటాలు పడ్డారు. టీడీపీలో చేరినా అక్కడ సరైన ఎదుగుదల లేదని భావించి వైసీపీలో చేరారు. ఇక్కడ కూడా రెండు సార్లు గెలిచిన తరువాత మంత్రి పదవి వచ్చింది. అంతకుముందు మహిళా రాష్ట్ర నాయకురాలిగా తన హవా చూపించారు. టీడీపీలో కూడా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా రాణించారు. జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవి వస్తుందని ఆశించినా మొదట నిరాశ కల్పించినా తరువాత మాత్రం తన ఆశ నెరవేరింది.

Also Read: Vakeel Subbu Singh: బిగ్‌ బాస్‌ తెలుగు సిజన్‌ 6లోకి వకీల్‌ సాబ్‌.. ఎవరీ ‘సుబ్బు సింగ్ పోగు’ ?

ప్రస్తుతం ఏపీలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు జబర్దస్త్ లో జడ్జిగా దాదాపు తొమ్మిదేళ్లు కొనసాగారు. మంత్రిగా అవకాశం రావడంతో జబర్దస్త్ నుంచి నిష్ర్కమించారు. అక్కడి నుంచి వెళ్లేటప్పుడు కన్నీళ్లు పెట్టుకుని నాకు అసలు వెళ్లడం ఇష్టం లేదని కానీ బాధ్యతలు నిర్వహించాల్సి ఉండటంతోనే వెళ్తున్నట్లు ఉద్వేగంతో చెప్పారు. అందరిని పట్టుకుని ఏడ్చేసింది. జబర్దస్త్ నుంచి తాను ఎమ్మెల్యేగా మంత్రిగా అయ్యానని పేర్కొన్నారు.

Minister Roja- Dubai Vacation
Dubai Vacation

ప్రస్తుతం రోజా దుబాయికి వెళ్లారు. కుటుంబంతో కలిసి విహార యాత్రలో ఉన్నారు. ఇసుక దిబ్బలపై సరదాగా ఆటలు ఆడుతున్నారు. పిల్లలతో కాలం గడుపుతున్నారు. తాళ్లతో పట్టుకుని ఇసుకపై వారితో ఎంజాయ్ చేస్తున్నారు. ఇసుకపై జారుతూ కేరింతలు కొడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రోజా కుటుంబంతో కలిసి విదేశాల్లో ఆనందంగా గడుపుతున్నారు. ఎప్పుడో సినిమాల్లో చేసేటప్పుడు వదేశాలకు వెళ్లిన రోజాకు ప్రస్తుతం మళ్లీ ఆ అవకాశం రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. భర్త, పిల్లలతో టైం స్పెండు చేస్తూ హాయిగా ఉన్నారు.

Also Read:Pawan Kalyan- Actor Nandu: పవన్ పై యంగ్ హీరో హాట్ కామెంట్..: పొత్తు వారితోనే అంటూ..

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular