Vakeel Subbu Singh: బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మొట్టమొదటి సారిగా బిగ్ బాస్ హౌస్ లోకి ఓ యంగ్ వకీల్ సాబ్ ఎంటర్ కానున్నాడా అంటే.. అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త ఇప్పుడు న్యూస్ మీడియాతో పాటు, సోషల్ మీడియాలోనూ తెగ చక్కర్లు కొడుతోంది. ఖమ్మం జిల్లా వాసి, తెలంగాణ స్టేట్ హై కోర్ట్ అడ్వకేట్ సుబ్బు సింగ్ పోగుకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది.

Vakeel Subbu Singh
తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 జులై నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సీజన్ 6లోకి సుబ్బు సింగ్‌కు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. అడ్వకేట్ అయిన సుబ్బు సోషల్ మీడియాలో సామాజిక అంశాలపైన చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ముఖ్యంగా ఆయనకు పేదల అడ్వకేట్ అనే పేరు కూడా ఉంది. ఎంతో మంది పేదల తరపున వకాల్తా పుచ్చుకొని కొన్ని వందల కేసులను ఉచితంగా వాదించి విజయం సాధించారు.
Also Read: Ravi Teja Becomes Director: డైరెక్టర్ గా మారిన రవితేజ..తొలి సినిమా ఆ హీరో తో??

Vakeel Subbu Singh
అంతే కాక, భర్తలు చనిపోయిన స్త్రీలకు, ఒంటరి మహిళలకు సంబంధించిన కొన్ని వందల కేసులను ఉచితంగా వాదించి వారికి అండగా నిలిచారు. సుబ్బు సింగ్ రంగస్థల నటుడిగా కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చారు. వెండి తెరపై తన ప్రతిభను చాటుకునే పనిలో ఉన్నారు. ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధార్థ గ్రామం కాగా గత కొంతకాలంగా హైదరాబాదులో నివాసముంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయవాద విద్యను పూర్తి చేసిన సుబ్బు త్వరలో విడుదల కానున్న ప్రధాన చిత్రాల్లో నటుడిగా చేశారు. అయితే న్యాయవాదిగా బిజీబిజీగా ఉండే సుబ్బు బిగ్ బాస్ హౌస్ కి వెళ్తారా? వెళ్ళరా? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read:Ram- Boyapati Movie: రామ్ – బోయపాటి మూవీ లో బాలయ్య బాబు