Minister Mallareddy DJ Tillu’s song : మంత్రి మల్లారెడ్డి.. ఆయన పేరుకు పెద్దరికం అయినా చేష్టలు మాత్రం చాలా సరదాగా ఉంటాయి. కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు. అసెంబ్లీలోనూ అలానే నవ్వులు పూయిస్తారు. ఇటీవల ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు జరిగినా కూడా ఆయన చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం ఆయన సొంతం.

మల్లారెడ్డి ఇంటా బయటా కూడా తెగ జోష్ గా ఉంటారు. తెగ సందడి చేస్తుంటారు. ఆయనకు 60 ఏళ్లు వచ్చినా కూడా తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పటికీ తన కాలేజీల్లో ఫంక్షన్లకు పేరున్న సినీ ప్రముఖులను రప్పిస్తూ వారితో కలిసి ఆడిపాడుతుంటాడు.
తాజాగా మల్లారెడ్డి కళాశాలలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, యంగ్ హీరో డీజే టిల్లు ఫేం సిద్దు జొన్నలగడ్డతో కలిసి తెగ హుషారెత్తించారు. విద్యార్థుల ముందు స్టేజీపై డీజే టిల్లు పాటకి డాన్స్ తో మల్లారెడ్డి వేసిన స్టెప్పులు అదిరిపోయాయి.
అసలు మల్లారెడ్డి ఇంత పర్ ఫెక్ట్ గా అచ్చం హీరో మాదిరిగా ఎలా స్టెప్పులు వేశాడని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మల్లారెడ్డి డ్యాన్స్ కు ఫిదా అయిపోయి ఇప్పుడా వీడియోను తెగ షేర్లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.