Megastar Chiranjeevi- Roja: ఈమధ్యనే మినిస్టర్ రోజా మెగా ఫ్యామిలీ పై విమర్శలు చెయ్యడం సోషల్ మీడియా లో ఎలాంటి దుమారం రేపిందో మన అందరికి తెలిసిందే..ఏ రోజులైనా చిరంజీవి, పవన్ కళ్యాణ్ , నాగబాబు ఆపదలో ఉన్నవారికి సహాయం చెయ్యడం ఎప్పుడైనా చూసారా..తన జోబులో నుండి రూపాయి కూడా బయటకి తియ్యరు..అలాంటి వాళ్ళు కాబట్టే జనాలు వాళ్ళని సొంత నియోజకవర్గాల్లోనే ఓడించి ఇంటికి పంపారు అంటూ ఆమె మాట్లాడిన మాటలు వివాదానికి దారి తీశాయి.

అభిమానులు చాలా తీవ్ర స్థాయి లో విరుచుకుపడ్డారు..పిల్లికి బిచ్చమ్ పెట్టే అలవాటు కూడా లేని నువ్వు మెగా బ్రదర్స్ ని అనే రేంజ్ కి వచ్చావా..నువ్వెంత నీ బ్రతుకెంత..పదవి లో ఉన్నావు కదా అని నోటికి ఏది పడితే అది వాగితే దవడ పళ్ళు రాళ్ళ కొడతాము అంటూ రోజా ని సోషల్ మీడియా లో ట్యాగ్ చేస్తూ తిడుతున్నారు అభిమానులు..రోజా కామెంట్స్ పై నాగబాబు కూడా చాలా ఘాటుగా స్పందించాడు.
అయితే వారు వీరయ్య సినిమా విడుదల అవుతున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు..ఈ ఇంటర్వ్యూ లో ఆయన రోజా చేసిన కామెంట్స్ పై పరోక్షంగా గట్టి విమర్శలే చేసాడు..ఆయన మాట్లాడుతూ ‘నా పేరు వాడకపోతే వాళ్ళని ఎవ్వరు పట్టించుకోరు..వాళ్లకి గుర్తింపు రాదు..అడ్డదారిలో గుర్తింపు కావాలి అంటే అడ్డదిడ్డం గా నా మీద నా కుటుంబం మీద మాట్లాడితే ఒక గుర్తింపు వస్తుంది..ఆ రకంగా కూడా వాళ్ళు గుర్తింపు రావాలని కోరుకుంటే ఓకే ఇచ్చేద్దాం అని నాకు అనిపిస్తూ ఉంటుంది..ఇప్పుడు ఆ స్థితికి నేను చేరుకున్నాను..నాతోటి ఉంటూ..ఇన్ని రోజులు ఇండస్ట్రీ లో స్నేహం గా ఉన్నవాళ్లు కూడా నా వెనుక చేరి కామెంట్స్ చేసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది..అరెరే నిన్ననే కదా వీళ్ళు మన ఇంటికి వచ్చి భోజనం చేసారు..ఇలా ఇంత అన్యాయంగా మాట్లాడితే ఎలా’.

‘నేను ఎవరికి సహాయ సహకారాలు చెయ్యలేదా..నేను ఎప్పుడు చెయ్యలేదో నిరూపించమనండి..నేను పబ్లిసిటీ ఇచ్చుకోలేదు అనేది అంటే అది ఓకే..నేను ఏమి సహాయం చెయ్యలేదు అంటే గనుక , నీకు అంతే తెలిసింది..నా సహాయం అందుకున్న వాళ్లకి తెలుసు నేనేంటో అది చాలు నాకు..వీళ్ళ చిల్లర కామెంట్స్ ని నేను మైండ్ కి తీసుకోను..నాకు మనసు ప్రశాంతం గా ఉండాలి’ అంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.