Candy Crush : ధోనిని ఫాలో అవుతున్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేళ్ల..  అసలేంటి కథ?

ధోనీకి సంబంధించిన ఈ వీడియో బయటకు వచ్చిన తరువాత క్యాండీ క్రష్ కు మరింత ఆదరణ వచ్చింది. కేవలం మూడు గంటల్లోనే 3.5 లక్షల మంది దీనిని డౌన్లోడ్ చేసుకున్నారు. గతంలో ఫుల్ పాపులర్ అయిన  ఈ గేమ్ ఇటీవల కనుమరుగైంది. కానీ ధోని సహకారంతో మరోసారి ట్రెండీగా మారింది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ సీఈవో ఈ గేమ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేయడంతో మరింత మంది గేమ్ ను డౌన్లోడ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

Written By: Srinivas, Updated On : July 1, 2023 3:02 pm
Follow us on

Candy Crush : కొన్ని మొబైల్స్ గేమ్స్ విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇవి మనసుకు ఉల్లాసాన్ని ఇవ్వడంతోపాటు మేథస్సు కూడా పెరగడంతో చాలా మంది వీటిని ఆడుతూ ఉంటారు. గేమింగ్ వరల్డ్ లో అత్యంత పాపులారిటీ సాధించించి క్యాండీ క్రష్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ గేమ్ కు అడిక్ట్ అయిపోయారు. కొంతమంది రోజుకు ఒక్కసారైనా క్యాండీ క్రష్ ఆడనిదే నిద్రపట్టదు. ఇక పిల్లలైతే ఈ గేమ్ కు ఫిదా అయిపోయారు. అయితే లేటేస్టుగా ఈ గేమ్ గురించి తీవ్ర చర్చసాగుతోంది. ఎందుకంటే ఈ గేమ్  ప్రముఖ క్రికెటర్ ధోనీని విపరీతంగా ఆకట్టుకుంది. బయటి ప్రపంచాన్ని మరిచిపోయి మరీ ఈ గేమ్ ను ఆడుతున్న ఓ వీడియో హల్ చల్ సృష్టిస్తోంది. ఈ వీడియోను చూసి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేళ్ల హాట్ కామెంట్ చేశాడు. ఆ వివరాలేంటంటే?
యాక్టివిజన్ బ్లిజార్డ్ అనే వీడియో గేమ్ కంపెనీ కొనుగోలుకు సంబంధించిన కేసు శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ కేసుకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేళ్ల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. వాదనలో భాగంగా క్యాండీ క్రష్ పై మీ అభిప్రాయమేంటి? అని న్యాయమూర్తి సత్యనాదేళ్లను అడిగారు. దీంతో తాను కూడా క్రికెటర్ ధోనీ లాగే ఈ గేమ్ ను ఆస్వాదిస్తానని, కాల్ ఆప్ డ్యూటీలో గేమ్ ఆడుతానని తెలిపాడు. దీంతో కోర్టులో ఉన్నవారంతా ఒక్కసారిగా ఘొల్లుమని నవ్వారు.

అయితే సత్యనాదేళ్ల ధోని గురించి చెప్పడంపై ప్రత్యేకత ఉంది. ప్రముఖ క్రికెటర్ ధోని ఓసారి ప్లేన్ జర్నీ చేస్తున్నప్పుడ తీక్షణంగా మొబైల్ వైపు చూస్తున్నాడు. అతను ఏం చేస్తున్నాడని కొందరు చూడగా.. క్యాండీ క్రష్ గేమ్ ఆడుతున్నట్లు తెలిసింది. దీంతో కొందరు ఆ వీడియోను తీసి నెట్టింట్లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా వైరల్ అయిన ఈ వీడియోను సత్యనాదేళ్ల కూడా వీక్షించారు. దీంతో సత్యనాదేళ్ల కోర్టులో ధోని వీడియో గురించి చెప్పడం ఆసక్తిగా మారింది.