‘Meter’ Collections : ‘మీటర్’ మొదటి రోజు వసూళ్లు..ఇలా అయితే ఇక కష్టమే!

‘Meter’ movie first day collections.. : కొద్దీ రోజుల క్రితమే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే సినిమాతో సూపర్ హిట్ ని అందుకొని ఫామ్ లోకి వచ్చిన కిరణ్ అబ్బవరం, మాస్ ఇమేజి కోసం ‘మీటర్’ అనే సినిమా చేసిన సంగతి మన అందరికీ తెల్సిందే.నేడే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది.మొదటి రోజు మొదటి ఆట నుండే డివైడ్ నుండే టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా నిల్.కొన్ని ప్రాంతాలలో మార్నింగ్ షోస్ […]

Written By: NARESH, Updated On : April 7, 2023 9:35 pm
Follow us on

‘Meter’ movie first day collections.. : కొద్దీ రోజుల క్రితమే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే సినిమాతో సూపర్ హిట్ ని అందుకొని ఫామ్ లోకి వచ్చిన కిరణ్ అబ్బవరం, మాస్ ఇమేజి కోసం ‘మీటర్’ అనే సినిమా చేసిన సంగతి మన అందరికీ తెల్సిందే.నేడే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది.మొదటి రోజు మొదటి ఆట నుండే డివైడ్ నుండే టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా నిల్.కొన్ని ప్రాంతాలలో మార్నింగ్ షోస్ హౌస్ ఫుల్స్ పడ్డాయి కానీ, టాక్ లేకపోవడం తో మ్యాట్నీస్ నుండి అన్నీ ప్రాంతాలలో థియేటర్స్ ఖాళీ అయిపోయాయి.

డైరెక్టర్ రమేష్ తాడూరి రొటీన్ కమర్షియల్ కథతో అంతకు మించి రోత పుట్టించే నాసిరకపు స్క్రీన్ ప్లే ఈ సినిమాని చూడడానికి వచ్చిన ప్రేక్షకులను టార్చర్ పెట్టేసాడు.అదంతా పక్కన పెడితే మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలు మరియు ఓవర్సీస్ లో కలిపి ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టింది,బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా ఎంత వసూళ్లు రావాలి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.

రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమాకి మొదటి రోజు కోటి రూపాయలకు లోపే షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 5 కోట్ల రూపాయలకు జరిగింది.మ్యాట్నీస్ నుండి వస్తున్న వసూళ్లు చూస్తూ ఉంటే ఈ సినిమా వీకెండ్ లో కూడా కోలుకోవడం కష్టమని అనిపిస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

మొత్తం మీద మూడు రోజులకు కలిపి రెండు కోట్ల రూపాయిల లోపే షేర్ వసూళ్లు వచ్చేలా ఉందని అంటున్నారు.ఇక వర్కింగ్ డేస్ లో గ్రాస్ రావడమే కష్టం, షేర్ ఎక్కడ నుండి వస్తుందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న మాట.దీనిని బట్టీ చూస్తే ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్ లో డిజాస్టర్ ఫ్లాప్ గా నిలవబోతుందని అంటున్నారు.ఇక నుండి ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ లో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంత తొందరగా ఎదిగాడో, అంతే తొందరగా కిందకి పడిపోతాడని అంటున్నారు.