Mehreen Pirzada: హీరోయిన్ మెహ్రీన్ పిర్జాడా సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. ఆమె ముఖం నిండా సూదులు గుచ్చి ఉండగా ఏమైందనే సందేహాలు మొదలయ్యాయి. ఒకవేళ వైద్యం అయితే , ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయా అని వాపోతున్నారు. మెహ్రీన్ తన ఫోటోలకు ఇచ్చిన కామెంట్స్ తో విషయం అర్థమైంది. ముఖంపై మడతలు పోయి, యంగ్ గా కనిపించేందుకు ఆకు స్కిన్ లిఫ్టింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ముఖం మీద సూదులు గుచ్చి ఒక పద్ధతి ప్రకారం ఈ చికిత్స అందిస్తారు.

ఇది నాన్ సర్జికల్ ట్రీట్మెంట్, అలాగే ఎలాంటి నొప్పి ఉండదట. తనకు ఆ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ జాన్ కి మెహ్రీన్ కృతజ్ఞతలు చెప్పారు. దుబాయ్ లేక లండన్ లో మళ్ళీ కలుద్దాం, అని కామెంట్ చేశారు. మెహ్రీన్ తన అందాన్ని మరింత పెంచుకోవడానికి ఈ చికిత్స తీసుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తుంది. కెరీర్ కొంచెం డల్ కావడంతో మెహ్రీన్ గ్లామర్ పై శ్రద్ధ పెంచారు. ఆమె బరువు తగ్గి బాగా సన్నబడ్డాడు. సహజంగానే బొద్దుగా ఉండే మెహ్రీన్ ఆ మధ్య వెయిట్ పెరిగి షేపవుట్ అయ్యారు.
ఎఫ్ 2 మూవీలో తమన్నా సన్నగా నాజూగ్గా కనిపిస్తుంటే మెహ్రీన్ మాత్రం బరువు పెరిగి ఇబ్బందికరంగా దర్శనమిచ్చారు. బరువు పెరిగితే ఇక కెరీర్ కష్టమే అని భావించి సన్నబడ్డారు. ఎఫ్ 3 మూవీలో మెహ్రీన్ స్లిమ్ లుక్ లో అలరించారు. కాగా మెహ్రీన్ కి హిట్ పడి చాలా కాలం అవుతుంది. ఎఫ్ 3 పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా మంచి వసూళ్లు రాబట్టలేకపోయింది. దీంతో ఆమెకు మళ్ళీ నిరాశే ఎదురైంది. కెరీర్ బిగినింగ్ లో ఆమె కొన్ని హిట్స్ అందుకున్నారు. కృష్ణగాడి వీర ప్రేమ గాధ వంటి హిట్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్… మహానుభావుడు, ఎఫ్ 2 చిత్రాలతో మంచి విజయాలు ఖాతాలో వేసుకున్నారు.

ప్రస్తుతం మెహ్రీన్ చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి. ఆమె కెరీర్ దాదాపు ముగిసినట్లే. కాగా మెహ్రీన్ హర్యానా మాజీ ముఖ్యమంత్రి భవ్య బిష్ణోయ్ తో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. కారణం తెలియదు కానీ ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. 28 ఏళ్ల మెహ్రీన్ కి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేనట్లుంది.ఇక తెలుగులో స్టార్ అయ్యే దారులు మూసుకుపోయినట్లే. ఈ క్రమంలో కన్నడలో అడుగుపెట్టి అదృష్టం పరీక్షించుకోవాలి అనుకుంటుంది.