New Rules December 1: డిసెంబర్ 1 నుంచి పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రభుత్వాలు పరిపాలనలో భాగంగా నూతన పద్ధతులు ప్రవేశపెట్టనున్నాయి. ఇందులో భాగంగానే డిసెంబర్ ఒకటి నుంచి కొన్ని అంశాల్లో మార్పులు తీసుకొస్తోంది. కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. బ్యాంకు లావాదేవీల్లో ఆర్థిక పరమైన అంశాల్లో మార్పులు చేసేందుకు నిర్ణయించారు వంట గ్యాస్ సిలిండర్ నుంచి పెన్షన్ సర్టిఫికెట్ వంటి వాటిల్లో సమూల మార్పులు వస్తున్నాయి. డిసెంబర్ ఒకటిని అనుకూల సమయంగా చూసుకుని మార్పులు చేపట్టింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎం కార్డు (పీఎన్ బీ) డిసెంబర్ 1 నుంచి కొత్త నిబంధన తీసుకొస్తోంది. ఏటీఎంల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవాలంటే మొబైల్ రిజిస్టర్డ్ మొబైల్ కి ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఏటీఎం లావాదేవీలు సురక్షితంగా సాగుతాయని విశ్వసిస్తోంది. దీనికి గాను కొత్త నిబంధనతో డెబిట్ కార్డు తో పాటు మొబైల్ ఫోన్ కూడా తప్పనిసరి తీసుకెళ్లాలి. శీతాకాల ట్రైన్ల టేబుల్ లో మార్పులు తీసుకొచ్చింది. చలికాలంలో రైళ్ల షెడ్యూల్ లో రైల్వే శాఖ మార్పులు చేయడం కామనే.
కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతున్న వారు ప్రతి ఏడాది లైఫ్ సర్టిఫికెట్ అందజేయాలి. లేదంటే నవంబర్ 30 2022 లోపు పెన్షనర్ల సర్టిఫికెట్ సమర్పించకపోతే కష్టమే. బ్యాంకు బ్రాంచ్ లో కానీ ఆన్ లైన్ లో కానీ జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి. ఇంతవరకు పొందుతున్న పెన్షన్ అలాగే ఉండాలంటే పెన్షన్ సర్టిఫికెట్ అందజేయడం తప్పనిసరి అని ప్రకటించింది. దీంతో పెన్షన్ పొందుతున్న వారు తమ పెన్షన్ సర్టిఫికెట్ అందిస్తేనే పెన్షన్ సక్రమంగా వస్తుంది.

డిసెంబర్ ఒకటి నుంచి ద్విచక్ర వాహనాల ధరలు పెరగనున్నాయి. హీరో మోటో కార్స్ ధరల పెంచాలని నిర్ణయించింది. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, భువనేశ్వర్ నగరాల్లో హీరో టూ వీలర్ ధరలు రూ. 1500 వరకు పెంచనున్నాయి. అంతే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం పుణ్యక్షేత్రంలో వీఐపీల బ్రేక్ దర్శనం సమయాల్లో ప్రయోగాత్మకంగా మార్పులు తీసుకొస్తోంది. ఇక మీదట వీఐపీ బ్రేక్ దర్శనాల సమయం 8 గంటలకు మార్చింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో రాత్రి వేళ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.