
Chiranjeevi New Car: మెగాస్టార్ చిరంజీవి లగ్జరీ కాల్ కలెక్షన్ లో మరో స్పెషల్ ఐటెం వచ్చి చేరింది. మార్కెట్ లోకి వచ్చిన టయోటా బ్రాండ్ న్యూ మోడల్ కారుని చిరంజీవి కొనుగోలు చేశారట. టయోటా వెల్ ఫైర్ మోడల్ కి చెందిన ఈ కారు ధర ఏకంగా రూ. 1.18 కోట్లని అని సమాచారం. కోటి రూపాయల కారు అంటే దాని ఫీచర్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అత్యాధునిక సౌకర్యాలు, సేఫ్టీ ఫీచర్స్ తో టయోటా వెల్ ఫైర్ రూపొందించారని సమాచారం.
ఇప్పటికే చిరంజీవి ఫ్యామిలీ వద్ద పదికి పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. రోల్స్ రాయిస్ నుండి స్పోర్ట్స్ కార్లు. లగ్జరీ బ్రాండ్స్ కి చెందిన హై ఎండ్ మోడల్స్ వారి కార్ గ్యారేజ్ లో ఉన్నాయి. చిరంజీవి ఫ్యామిలీకి ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది. చిరంజీవి ఫ్యామిలీ లోకల్ ట్రిప్స్ కి ఈ ప్రైవేట్ జెట్లోనే వెళతారు. టాలీవుడ్ హీరోలలో అత్యంత ధనవంతులుగా చిరంజీవి, రామ్ చరణ్ ఉన్నారు. చిరంజీవి దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమను ఏలారు. ఆయన కుమారుడు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు.
రామ్ చరణ్ రెమ్యూనరేషన్ వంద కోట్లకు చేరింది. ఇక చరణ్ భార్య ఉపాసన అపోలో గ్రూప్ వైస్ ఛైర్ పర్సన్ గా ఉన్నారు. హాస్పిటల్స్, ఫార్మా కంపెనీలు ఉన్న అపోలో గ్రూప్ లో ఉపాసన వాటా విలువ వేల కోట్లలో ఉంటుంది. మరి ఇంత ఉన్నతమైన ఫ్యామిలీకి కోటి రూపాయల కారు అంటే చాలా చిన్న విషయం. కాగా చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన గత చిత్రం వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యారు. ఆస్కార్ గెలిచిన చిత్ర హీరోగా రికార్డులకు ఎక్కారు. దర్శకుడు శంకర్ తో చరణ్ గేమ్ ఛేంజర్ టైటిల్ తో పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా విడుదల కానుందని సమాచారం. దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. కియారా అద్వానీ హీరోయిన్.