Tamanna Bhatia: సౌత్ లో టాప్ 5 హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో తమన్నా పేరు కచ్చితంగా ఉంటుంది.మంచు మనోజ్ హీరో గా నటించిన ‘శ్రీ’ చిత్రం ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా తమన్నా ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘హ్యాపీ డేస్’ సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ అనతి కాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. అయితే అప్పట్లో ఈమె తమిళం లో ఒక ప్రముఖ స్టార్ హీరో తో ప్రేమాయణం నడిపినట్టు వచ్చిన ఒక వార్త ఎంత సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తమన్నా అతనితో ప్రేమాయణం నడపడం వల్ల వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులకు గురైందని, మానసికంగా కూడా బాగా దెబ్బతినింది అని అంటుంటారు.
అంతే కాదు అప్పట్లో ఈమెకి ఆ హీరో గర్భం కూడా చేసాడని, అతనితో విడిపోయిన తర్వాత తమన్నా అవాషన్ కూడా చేయించుకుందని వార్తలు వచ్చాయి. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో ఎవరికీ తెలియదు కానీ, ఈ రూమర్ ఇప్పటికీ సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉంది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా వీళ్లిద్దరు పార్టీ లో కిస్ చేసుకుంటూ పెట్టిన ఒక వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.అప్పటి నుండి వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు, డేటింగ్ చేస్తున్నారు అంటూ వార్తలు వచ్చేవి. ఈ వార్తలపై అటు విజయ్ వర్మ కానీ, ఇటు తమన్నా కానీ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోవడం తో ఇది నిజం అని అభిమానులు కూడా నమ్ముతున్నారు.