Waltair Veerayya: ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి జోరు మామూలుగా లేదు..ఆచార్య మరియు గాడ్ ఫాదర్ వంటి కమర్షియల్ ఫెయిల్యూర్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద కాస్త వెనుకపడిన మెగాస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం తో తన విశ్వ రూపం చూపించాడు..కమర్షియల్ చేస్తే మెగాస్టార్ చిరంజీవి ముందు ఏ హీరో కూడా సరితూగరు అని చెప్పడానికి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఒక ఉదాహరణ..సినిమాలో ఉన్న కంటెంట్ ఈ రేంజ్ ప్రభంజనం సృష్టించే రకమైన స్టోరీ కాదు..చాలా రొటీన్ మరియు సాదాసీదా కమర్షియల్ సినిమా.

సెంటిమెంట్ సన్నివేశాలు వర్కౌట్ అవ్వడం తో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు..పది రోజుల పాటు బాక్స్ ఆఫీస్ వద్ద వీరంగం ఆడిన ఈ చిత్రం, 11 వ రోజు కూడా స్టడీ కలెక్షన్స్ ని సాధిస్తూ సామ్ సంచలనం సృష్టించింది..మార్నింగ్ షోస్ నుండే ప్రధాన నగరాల్లో ఈ చిత్రం మంచి హోల్డ్ ని దక్కించుకుంది.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం లో ఈ సినిమాకి 11 వ రోజు కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి..ఈ ప్రాంతం లో ‘వాల్తేరు వీరయ్య’ ప్రభంజనం చూస్తుంటే #RRR చిత్రం వసూళ్లను కూడా ఫుల్ రన్ లో దాటేస్తుందా అనే అనుమానం రాక తప్పదు..ఈస్ట్ గోదావరి లో కూడా ఈ చిత్రం 11 వ రోజు చాలా సెంటర్స్ లో అద్భుతమైన కలెక్షన్స్ ని దక్కించుకుంది..మార్నింగ్ షోస్ కి ఈ రేంజ్ ఉంటే , సాయంత్రం ఆటలకు ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

మొత్తం మీద 11 వ రోజు ఈ చిత్రానికి మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు..ఇదే జోరు జనవరి 26 వ తేదీ వరకు కొనసాగిస్తే అలా వైకుంఠ పురం లో (160 కోట్లు ) కలెక్షన్స్ ని అవలీలగా దాటేస్తుందని అంటున్నారు..ఇప్పటి వరకు ఈ చిత్రానికి 120 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.