Balakrishna- Honey Rose: హీరో బాలకృష్ణ-హనీ రోజ్ కి సంబంధించిన ఓ రొమాంటిక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కారణం ఆ ఫోటోలో బాలయ్య,హనీ రోజ్ చేతులు కలిపి ఓ క్లోజ్ ఫోజులో మందేస్తున్నారు. వీరసింహారెడ్డి సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా చోటు చేసుకున్న ఈ సంఘటన నెటిజెన్స్ దృష్టిని ఆకర్షించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి హిట్ అందుకుంది. బాలయ్య కెరీర్లో భారీ హిట్ గా నిలిచింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం సంక్రాంతి సీజన్ ని క్యాష్ చేసుకుంది.

దర్శకుడు గోపీచంద్ మలినేని మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. శృతి హాసన్ మొదటిసారి బాలయ్యతో జతకట్టారు. మలయాళ నటి హనీ రోజ్ కీలక రోల్ దక్కించుకున్నారు. ఆమె బాలయ్య భార్యగా, తల్లిగా రెండు షేడ్స్ ఉన్న రోల్ చేశారు. థమన్ సంగీతం అలరించింది. ఇక బాలయ్య యాక్షన్, ఊర మాస్ డైలాగ్స్ కి అలరించాయి. అయితే రొటీన్ కథ, ఆసక్తి లేని కథనం విసుగు పుట్టించాయి. కేవలం పండుగ కారణంగా మినిమమ్ వసూళ్లు దక్కాయి. బాలయ్యకు మాత్రం వీరసింహారెడ్డి పెద్ద హిట్ కొట్టింది.
నిన్న హైదరాబాద్ వేదికగా వీరసింహారెడ్డి సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు. యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్ హరీష్ శంకర్ అతిథులుగా హాజరయ్యారు. మూవీలో నటించిన హనీ రోజ్, వరలక్ష్మీ కూడా పాల్గొన్నారు. ఇక బాలయ్య తన మార్కు స్పీచ్ తో అలరించారు. ఆయన స్వయంగా ఓ పాట పాడటం విశేషం. ఆయన పాట వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న బాలయ్య పాడారు కాబట్టి జనాలు సర్దుకుపోయారు.

కాగా అనంతరం వీరసింహారెడ్డి టీం ప్రైవేట్ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఓ ఫోటో బయటకు వచ్చింది. బాలయ్య-హనీ రోజ్ చేతులు మెలివేసి షాంపేన్ సేవిస్తున్నారు. ఆ ఫోటో చూశాక ఒక్క సినిమాతో హనీ రోజ్ బాలయ్యకు బాగా దగ్గరైపోయారని చెప్పుకుంటున్నారు. బాలయ్యతో ఆమెకు అనుభందం పెరిగిందని భావిస్తున్నారు. బాలయ్య అంతే మరి… ఎవరైనా నచ్చితే చిన్నపిల్లాడై చనువుగా మెదులుతారు. కాగా హనీ రోజ్ మొదటి తెలుగు చిత్రం ఆలయం. అది 2008లో విడుదలైంది. అనంతరం 2014లో ‘ఈ వర్షం సాక్షిగా’ టైటిల్ తో మరో తెలుగు మూవీ చేశారు. చాలా గ్యాప్ అనంతరం వీరసింహారెడ్డి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు.