Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో కూడిన కథ తో మన ముందుకి వస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’..ప్రముఖ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..దీపావళి కానుకగా ఈ సినిమాకి సంబంధించి మూవీ టీం విడుదల చేసిన టైటిల్ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో అభిమానుల్లో ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయిలో పెంచేసుకున్నారు.

సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఈ నెల నుండే విడుదల చేయబోతున్నారట మూవీ టీం..అతి త్వరలోనే దేవిశ్రీ ప్రసాద్ అందించిన మొదటి పాట ని విడుదల చేయబోతున్నారట..ప్రస్తుతం హైదరాబాద్ సిటీ పరిసరాల్లో వేసిన సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి పై టైటిల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది..శేఖర్ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది..ఈ సినిమాలో చిరంజీవి మరియు రవితేజ అన్నదమ్ములుగా నటిస్తున్నారు..అన్నదమ్ములు అంటే ఒకే తల్లికి పుట్టినవారు కాదు..రవితేజ సవతి తల్లికి పుట్టినవాడు అన్నమాట..ఒక నిజాయితీ గల పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రని ఇందులో రవితేజ చేస్తున్నాడు..అయితే విలన్స్ రవితేజ ని ఒక నేరస్తుడిగా జనాల ముందు ప్రాజెక్ట్ చేసి చంపేస్తారట..తన తమ్ముడి నిజాయితీని నిరూపిస్తూ అతని మీద పడిన అపనిందని తొలగించి గొరవ వందనాలు అరిపించేలా చేస్తాడట చిరంజీవి..ఇదే ఈ సినిమా స్టోరీ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్..అయితే ఇదే స్టోరీ తో మహేష్ బాబు గతం లో ఆగడు అనే సినిమా చేసాడు..అది బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.

కానీ ‘వాల్తేరు వీరయ్య’ మాత్రం ఫాన్స్ కి పూనకాలు రప్పించే విధంగానే డైరెక్టర్ డిజైన్ చేసాడట..అయితే ఈ కథాంశం తో ఇదివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి..డైరెక్టర్ టేకింగ్ ని బట్టే చివరి ఔట్పుట్ ఉంటుంది కాబట్టి కచ్చితంగా వాల్తేరు వీరయ్య దుమ్ము లేపేస్తుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు..మరి వారి నమ్మకాలను ఈ సినిమా ఎంత వరుకు నిలబెడుతుందో తెలియాలంటే సంక్రాంతి వరుకు ఆగాల్సిందే.