spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan CM: పవన్ కళ్యాణ్ సీఎం.. చంద్రబాబు ఒప్పుకుంటారా? అప్పగిస్తాడా?

Pawan Kalyan CM: పవన్ కళ్యాణ్ సీఎం.. చంద్రబాబు ఒప్పుకుంటారా? అప్పగిస్తాడా?

Pawan Kalyan CM: ర‌ణ‌స్థ‌లం యువ‌శ‌క్తి స‌భ ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పింది. మ‌రెన్నో ప్ర‌శ్న‌ల‌కు పురుడు పోసింది. జ‌న‌సేనాని త‌న మ‌నోగ‌తాన్ని ఆవిష్క‌రించారు. రాజ‌కీయ ప్రయాణం పై స్ప‌ష్ట‌త‌నిచ్చారు. కానీ కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌సేనాని వ్యాఖ్య‌లు కొత్త చ‌ర్చ‌కు దారితీశాయి. ఏపీ రాజ‌కీయాన్ని ర‌స‌వ‌త్త‌రంగా మార్చేశాయి.

Pawan Kalyan CM
Pawan Kalyan CM

“పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అని మీరు చెప్పాలి. నేను కోరుకుంటే జరగదు. మీరు అధికారం ఇస్తే సేవకుడిలా పనిచేస్తా..’’ అంటూ ర‌ణ‌స్థ‌లం వేదిక‌గా ప‌వ‌న్ త‌న మనోగతం చెప్పుకున్నారు. ఈ వ్యాఖ్య‌లు ఏపీ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. టీడీపీ, జ‌న‌సేన నేతృత్వంలో ఏర్ప‌డ‌బోయే ప్ర‌భుత్వంలో తాను కీల‌క పాత్ర‌పోషిస్తాన‌ని ప‌వ‌న్ చెప్ప‌క‌నే చెప్పారు. జ‌న‌సేన అధికారం కోసం జ‌న‌సైనికులు అహ‌ర్నిశ‌లు శ్ర‌మించాల్సిన అవ‌స‌రాన్ని గుర్తి చేశారు. సీట్ల పంప‌కంలో త‌మ న్యాయ‌మైన వాటా ఉండాలంటూ ప‌రోక్షంగా టీడీపీకి సూచ‌న చేశారు.

ప‌వ‌న్ వ్యాఖ్య‌లు టీడీపీలో ఒకింత క‌ల‌వ‌రానికి కార‌ణ‌మయ్యాయి. ప‌వ‌న్ ను సీఎంను చేసేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధ‌ప‌డ‌తాయా?. చంద్ర‌బాబు ఒప్పుకుంటాడా ? అన్న చ‌ర్చ మొద‌లైంది. ప‌వ‌న్ సీఎం కావాలంటే సీట్ల పంప‌కం నుంచే దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది. పొత్తులో భాగంగా తీసుకున్న సీట్ల‌లో ఎన్ని సీట్లు గెలుస్తార‌న్న అంశం కూడ కీల‌కం కానుంది. పోటీ చేసే సీట్ల‌లో మెజార్టీ సీట్లు గెల‌వ‌గ‌లిగితే ప‌వ‌న్ డిమాండ్ల‌కు టీడీపీ త‌లొగ్గాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. లేనిప‌క్షంలో టీడీపీతో అధికారాన్ని పంచుకోవాల్సి ఉంటుంది.

Pawan Kalyan CM
Pawan Kalyan CM

ప‌వ‌న్ సీఎం కావాంటే కింగ్ మేక‌ర్ కావాల్సిన అవ‌స‌రం ఉంది. క‌నీసం 40 సీట్లు గెలిస్తే ప‌వ‌న్ ఈజీగా ముఖ్య‌మంత్రి అవుతాడు. చంద్ర‌బాబుకు కూడ త‌లొగ్గాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ఇప్ప‌టికే సీట్ల పంప‌కం పై కూడ జ‌న‌సేనాని టీడీపీకి హింట్ ఇచ్చారు. గౌర‌వ‌ప్ర‌ద‌మైన సీట్లు ఇవ్వాల‌నే డిమాండ్ ప‌రోక్షంగా టీడీపీ ముందు ఉంచారు. జ‌న‌సేన డిమాండ్ మేర‌కు టీడీపీ సీట్లు ఇచ్చి.. జ‌న‌సేన మెజార్టీ స్థానాల్లో గెల‌వ‌గ‌లిగితే సీఎం కావడం సులువు అవుతుంది. లేదంటే టీడీపీ సీఎం ప‌ద‌వి వ‌దులుకోవ‌డానికి అంత ఈజీగా ఒప్ప‌కోదు. 2024 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన గెలిచే స్థానాలే ప‌వ‌న్ భ‌విత‌వ్యాన్ని తేల్చ‌నున్నాయి.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Related News

Most Popular

Nara Lokesh

Nara Lokesh: ఎంట్రోయ్.. లోకేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరల్ వీడియో

Nara Lokesh: సొంత నియోజకవర్గ మంగళగిరిలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్. గత రెండు రోజులుగా ఆయన పర్యటన కొనసాగుతోంది. నియోజకవర్గంలో దాదాపు 3,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు...
Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao: ఎమ్మెల్యే వద్దు.. ఎంపీ ని అవుతానంటున్న ఆ సీనియర్!

Ganta Srinivasa Rao: ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కచ్చితంగా ఈ బిల్లు ఆమోదం పొంది 2029 సార్వత్రిక ఎన్నికలు.. పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయన్న టాక్...
Andhra Pradesh Local Elections

Andhra Pradesh Local Elections: స్థానిక ఎన్నికల్లో వైసీపీకి చావుదెబ్బ.. కూటమి ప్లాన్ అదుర్స్!

Andhra Pradesh Local Elections: కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధపడుతోంది. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అనేవి ముందుగా జరపడం సహజం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మున్సిపల్...
Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Oktelugu Epaper