Chiranjeevi: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి స్థానం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..నాలుగు దశాబ్దాలుగా ఆయన నిర్మించుకున్న అభిమాన సామ్రాజ్యం ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా ఆయన వెంట్రుకని కూడా కదిలించలేవని రీసెంట్ గా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా రుజువు చేసింది..వరుసగా ‘ఆచార్య’ మరియు ‘గాడ్ ఫాదర్’ సినిమాలు ఫ్లాప్ అవ్వడం తో చిరంజీవి పని ఇక అయిపోయింది..రిటైర్మెంట్ ఇవ్వడం బెటర్ అంటూ ఎన్నో కామెంట్స్ వచ్చాయి.

ఆ సిల్లీ కామెంట్స్ అన్నిటికి ‘వాల్తేరు వీరయ్య’ సినిమానే గట్టి సమాధానం..మిగతా హీరోలకు పాన్ ఇండియన్ సబ్జక్ట్స్..పెద్ద పెద్ద డైరెక్టర్స్ కావాలేమో..కానీ చిరంజీవి కి ఒక డైరెక్ట్ కమర్షియల్ సినిమా చాలు, ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని మడతపెట్టేస్తాడు అని మరోసారి ప్రూవ్ చేసింది ఈ చిత్రం..అయితే అభిమానులు భయపడేది చిరు చేసే రీమేక్ సినిమాలను చూసే..ఓటీటీ రాజ్యం ఏలుతున్న ఈరోజుల్లో రీమేక్ సినిమాలను ఆడియన్స్ థియేటర్స్ లో పెద్దగా ఆదరించడం లేదు.
మెగాస్టార్ చిరంజీవి గత చిత్రం ‘గాడ్ ఫాదర్’ కి పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ సరిగా ఆడకపోవడానికి కారణం రీమేక్ అవ్వడం వల్లే..మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫెర్ సినిమాకి రీమేక్ ఇది..ఈ సినిమా అప్పటికే తెలుగు డబ్ అయ్యి విడుదల అవ్వడం..తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉండడం వల్ల అభిమానులు తప్ప న్యూట్రల్ ఆడియన్స్ ఈ సినిమాని ఆదరించలేదు..ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తర్వాత ఆయన తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన ‘వేదలమ్’ సినిమాకి రీమేక్ గా ‘భోళా శంకర్’ అనే సినిమా చేస్తున్నాడు..మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాని ఆపేయమని సోషల్ మీడియా లో అభిమానులు చిరంజీవిని ట్యాగ్ చేసి బ్రతిమిలాడుతుంటే, మరో పక్క మెగాస్టార్ మరో రీమేక్ చెయ్యబోతున్నాడు అంటూ వచ్చిన వార్తలు అభిమానులకు దిమ్మతిరిగి బొమ్మ కనపడేలా చేసింది..అజిత్ హీరో గా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘విశ్వాసం’ ని తెలుగు లో రీమేక్ చెయ్యబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి..అయితే వీటిల్లో ఎలాంటి నిజం లేదని..పనికిమాలిన రూమర్స్ ని నమ్మొద్దు అంటూ చిరంజీవి సన్నిహిత వర్గాలు అభిమానులకు క్లారిటీ ఇచ్చారు..దీనితో ఆందోళనకరమైనా వాతావరణం కాస్త శాంతించింది.