Sudigali Sudheer- Hyper Aadi: రాజకీయాల్లో ఈమధ్య సినీ గ్లామర్ ఎక్కువైపోయింది..ముఖ్యంగా కమెడియన్స్ అందరూ వైసీపీ మరియు జనసేన పార్టీల మధ్య తిరుగుతూ ఉన్నారు..ప్రముఖ కమెడియన్ అలీ వైసీపీ పార్టీ లో ఉండగా, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వీ మరియు జబర్దస్త్ టాప్ మోస్ట్ కమెడియన్ హైపర్ ఆది జనసేన పార్టీ లో ఉన్నారు..రీసెంట్ గా శ్రీకాకుళం లోని రణస్థలం లో పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం నిర్వహించిన ‘యువ శక్తి’ అనే ప్రోగ్రాం లో హైపర్ ఆది కూడా పాల్గొన్నాడు.

ఈ ప్రోగ్రాం లో వైసీపీ పార్టీ ని ఉద్దేశిస్తూ హైపర్ ఆది చేసిన కామెంట్స్ ఎంతటి వివాదాలకు దారి తీసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..రోజా కూడా దీనిపై కౌంటర్లు వేసింది..జబర్దస్త్ లో ఆమె న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుండగా హైపర్ ఆది ఒక కమెడియన్ గా ఎన్నో ఏళ్ళ నుండి చేస్తున్న విషయం తెలిసిందే..తనకి రోజా తో అన్నేళ్ల సాన్నిహిత్యం ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ కోసం హైపర్ ఆది అలా మాట్లాడడం పవన్ అభిమానులను ఎంతో మెప్పించింది.
అయితే ఇప్పుడు రోజా కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులను హైపర్ ఆది కి కౌంటర్లు వేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం..ఆ ఆర్టిస్టులతో సుడిగాలి సుధీర్ కూడా ఉన్నాడు..సుధీర్ మరియు హైపర్ ఆది ఎంత మంచి స్నేహితులు అనే విషయం మనకి తెలుసు..అంతే కాకుండా అతను పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని..ఈ విషయాన్నీ ఎన్నో సందర్భాలలో తెలిపాడు సుడిగాలి సుధీర్.

అలాంటి సుధీర్ పవన్ కళ్యాణ్ మీద నిరంతరం నోరు పారేసుకుంటూ ఉండే వైసీపీ పార్టీ తో చేతులు కలుపుతాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న..రోజా నుండి ఒత్తిడి అయితే బాగా వస్తుంది కానీ, సుడిగాలి సుధీర్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అనేది తెలియాల్సి ఉంది..అలా రాజకీయాల్లో ఈ జబర్దస్త్ కమెడియన్స్ ఈమధ్య తలదూర్చడం కామన్ అయిపోయింది..ఇలా ఒక పార్టీ కి స్టాండ్ తీసుకోవడం వల్ల వీళ్లిద్దరి కెరీర్ పై ఏమైనా ప్రభావం పడుతుందా లేదా అనేది చూడాలి.