
Chiranjeevi- Director Vasishta: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చిన ఊపుతో మెహర్ రమేష్ తో కలిసి ‘భోళా శంకర్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాని ఆగస్టు 11 వ తేదీన విడుదల కాబోతుంది. ఇది తమిళం లో అజిత్ హీరోగా నటించిన ‘వేదలమ్’ చిత్రానికి రీమేక్, ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ పై అసంతృప్తి తో ఉన్నారు. ఈ విషయాన్నీ పసిగట్టిన చిరంజీవి ఇక నుండి అభిమానులకు నచ్చే ప్రాజెక్ట్స్ చెయ్యడానికే మొగ్గు చూపిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.
రీసెంట్ గానే భింబిసారా డైరెక్టర్ వసిష్ఠ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా సెట్ అయ్యిందట. గత కొంతకాలం క్రితమే మెగాస్టార్ ని కలిసి ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ ని వినిపించాడట వసిష్ఠ.అది విన్న చిరంజీవి ఎంతో ఆనందించి ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకొని రమ్మన్నాడట.
నిన్ననే వసిష్ఠ మెగాస్టార్ చిరంజీవి ని కలిసి ఫైనల్ డ్రాఫ్ట్ ని వినిపించాడట, చిరంజీవి ఎంతో సంతృప్తి చెందినట్టు సమాచారం. సెప్టెంబర్ నుండి షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోమని చెప్పేశాడట. ఇంతకీ ఈ మూవీ స్క్రిప్ట్ సోషియో ఫాంటసీ కి సంబంధించినది అట. స్వర్గం తన భార్య , పిల్లలతో కలిసి ఉంటున్న ఒక వ్యక్తి జీవితం లో ఏర్పడిన కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట వసిష్ఠ.

పూర్తిగా సోషియో ఫాంటసీ చిత్రం కావడం తో ఈ చిత్రానికి సుమారుగా 200 కోట్ల రూపాయిల బడ్జెట్ అవుతుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరికొన్ని విశేషాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు. చిరంజీవి చాలా కాలం తర్వాత తన వయస్సుకి తగ్గ పాత్రని పోషిస్తున్నాడని, కచ్చితంగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త ప్రభంజనం సృష్టిస్తుందనే నమ్మకం ఉందని ఈ సందర్భంగా మెగా అభిమానులు చెప్తున్నారు.