
వారసులంటే ఎవరికైనా ప్రేమ. టాలీవుడ్ ను ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవికి తగ్గ కొడుకుగా రాంచరణ్ ఎదుగుతున్నాడు. వరుస సినిమాలతో తన స్థాయిని తానే పెంచుకుంటున్నాడు. రాబోయే ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోతున్నాడు.
2007లో చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ 14 ఏళ్లలో ఎంతో పెద్ద స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం రాజమౌళి, శంకర్ లాంటి దిగ్గజ దర్శకులతో సినిమాలు చేస్తూ భవిష్యత్ ను బంగారు మయం చేసుకుంటున్నాడు. సౌత్ సూపర్ స్టార్ గా ఎదిగేందుకు రెడీ అవుతున్నారు.
అయితే ఎదుగుతున్న కొడుకు రాంచరణ్ బర్త్ డే సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి ఓ పాతజ్ఞాపకాలతో వీడియో రూపొందించి సోషల్ మీడియాలో ‘రాంచరణ్ కు’ బర్త్ డే విషెస్ తెలిపాడు. రాంచరణ్ 36వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా చిరంజీవి ‘హ్యాపీ బర్త్ డే మై బోయ్’ అంటూ ఓ స్పెసల్ వీడియో విడుదల చేశాడు. అదిప్పుడు అభిమానుల్లో వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా చిరంజీవి, రాంచరణ్ లు చిన్నప్పటి నుంచి నేటి ఆచార్య సినిమా వరకు కలిసి ఉన్న అరుదైన ఫొటోలతో ఈ వీడియోను రూపొందించారు. తనను ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకునే తనయుడు అంటూ చిరు ఈ వీడియోలో వెల్లడించారు. చిరు ఎమోషనల్ అయిన ఆ వీడియో ఇదే..