https://oktelugu.com/

Chiranjeevi: మేడే రోజు “పని జ్ఞాపకాన్ని” పంచుకున్న మెగాస్టార్.. గుండెల్నీ పిండావ్ బాస్

అప్పట్లో పేరుపొందిన బుల్లితెర నటులతో ఒక ప్రకటన రూపొందించారు. ఓ పేద మహిళకు ఇద్దరు ఆడపిల్లలు సంతానంగా ఉంటారు. భర్త తాగుడుకు బానిసవుతాడు. ఇంట్లో పూట గడిచే మార్గం లేకపోవడంతో ఓ డబ్బున్న ఇంట్లో ఇంటి పనికి కుదురుతుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 1, 2024 / 10:36 AM IST

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi: పిల్లలు బడికి.. పెద్దలు పనికి.. సరిగ్గా 22 సంవత్సరాల క్రితం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్.. సరికొత్త క్యాంపెయిన్ రన్ చేసింది. అప్పట్లో ఈ కార్యక్రమానికి అంబాసిడర్ గా మెగాస్టార్ చిరంజీవి ఉండేవారు. సమాజ హితమైన ఈ కార్యక్రమం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రచారం చేశారు. పైగా తన వంతుగా విరాళం కూడా ఇచ్చారు. అప్పట్లో ఈ క్యాంపెయిన్ ను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా రన్ చేసేవారు. తన సినిమాలకు సంబంధించి టైటిల్ కార్డ్స్ పడుతున్నప్పుడు ముందుగా దీనిని ప్రత్యేకంగా డిస్ ప్లే చేయించేవారు. నటుడిగా తనకు ఎంతో ఇచ్చిన ఈ సమాజం కోసం.. తన బాధ్యతగా ఇటువంటి ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టేవారు. అప్పట్లో మనదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో బాల కార్మిక వ్యవస్థ ఉండేది. పలు షాపులలో బాల కార్మికులు పనిచేసేవారు. ఫలితంగా అక్షరాస్యత శాతం తక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించేందుకు సంకల్పించింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ముందు ఉంచగా.. ఆయన మరో మాటకు తావు లేకుండానే ఒప్పుకున్నారు.

    అప్పట్లో పేరుపొందిన బుల్లితెర నటులతో ఒక ప్రకటన రూపొందించారు. ఓ పేద మహిళకు ఇద్దరు ఆడపిల్లలు సంతానంగా ఉంటారు. భర్త తాగుడుకు బానిసవుతాడు. ఇంట్లో పూట గడిచే మార్గం లేకపోవడంతో ఓ డబ్బున్న ఇంట్లో ఇంటి పనికి కుదురుతుంది. ఆ ఇంటి చాకిరీ మొత్తం చేసేందుకు ఆమెకు శరీరం సహకరించదు. దీంతో తన ఇద్దరు కూతుళ్లను కూడా పనికి తీసుకొస్తుంది. వారు చిన్న పిల్లలు కావడంతో అంత పనిచేయలేక పోతారు. ముఖ్యంగా ఓ చిన్నారి నీళ్లు పట్టుకు ముఖ్యంగా ఓ చిన్నారి నీళ్లు పట్టుకు వచ్చే క్రమంలో బిందెను కింద పడేస్తుంది. అది చూసిన ఆ తల్లి కన్నీటి పర్యంతమవుతుంది. అలా ప్రకటన మూసిన తర్వాత ” పలక బలపం పట్టుకునే చిన్నారులు పనికి పిల్లలు చదువుకోవాలి. పెద్దలు పనిచేయాలి.” అంటూ చిరంజీవి వాయిస్ వస్తుంది. ఈ ప్రకటన అప్పట్లో సంచలనంగా మారింది.

    ఈ ప్రకటన ను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ విస్తృతంగా ప్రచారం చేసేది. పిల్లల్లో డ్రాప్ ఔట్ రేట్ తగ్గించేందుకు కృషి చేసేది. వయోజన విద్య ద్వారా బాల కార్మికులకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించేది. తల్లిదండ్రులకు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేది. ఫలితంగా అక్షరాస్యత శాతం పెరగడం మొదలుపెట్టింది.. నాడు ఈ కార్యక్రమాన్ని సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకొని చిరంజీవి చేయడం.. అది ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో చాలామంది తమ స్వచ్ఛందంగా పాఠశాలలకు పంపడం ప్రారంభించారు.. 22 సంవత్సరాల క్రితం ఈ ప్రకటన విడుదలయిన నేపథ్యంలో.. నాటి వీడియోను బుధవారం మే డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. “22 సంవత్సరాల క్రితం చిన్న పిల్లల్ని పని పిల్లలుగా చేయొద్దని.. అంతర్జాతీయ కార్మిక సంస్థకు “చిన్ని చేతులు” అనే పేరుతో క్యాంపెయిన్ నిర్వహించాం. ఈరోజుకు అది రిలవెంట్ గా అనిపించి షేర్ చేస్తున్నాను. సే నో టూ చైల్డ్ లేబర్” అంటూ చిరంజీవి కామెంట్ జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఎక్స్ లో వైరల్ గా మారింది.