Chiranjeevi -Waltair Veerayya: ఈమధ్య కాలం లో అతి తక్కువ రేటింగ్స్ మరియు నెగటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’..ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ గా నిలిచే దిశగా ముందుకు పోతుంది..రివ్యూస్ కి బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ కి సంబంధం లేకుండా ఈ మధ్య కాలం లో చాలా సినిమాలే వచ్చాయి.

సోషల్ మీడియా బాగా వృద్ధిలోకి వచ్చిన తర్వాత రివ్యూస్ ప్రాముఖ్యత బాగా తగ్గిపోయింది..సినిమాలో కంటెంట్ జనాలకు నచ్చితే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తున్నాయి..అందులో ‘వాల్తేరు వీరయ్య’ కూడా ఒక్కటి..తమ వర్గపు హీరో సినిమా విడుదలైంది అని పచ్చ మీడియా తెల్లవారుజామున నుండి ఈ చిత్రానికి వరస్ట్ రేటింగ్స్ ఇచ్చి టాక్ ని బ్యాడ్ చెయ్యడానికి చాలా ప్రయత్నాలే చేసింది..కానీ ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి.
ఇక అసలు విషయానికి వస్తే నిన్న అమెరికా మొత్తం ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి సంబంధించి స్పెషల్ ఫ్యాన్స్ షోస్ ని ఏర్పాటు చేసుకున్నారు మెగా ఫ్యాన్స్..దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..అయితే షో కి ఇంటర్వెల్ సమయం లో చిరంజీవి వెండితెర మీద జూమ్ కాల్ ద్వారా అభిమానులతో కనెక్ట్ అయ్యాడు..కాసేపు అభిమానులతో చిట్ చాట్ చేసాడు..ఈ సందర్భంగా ఆయన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి పచ్చ మీడియా ఇచ్చిన రివ్యూస్ మరియు రేటింగ్స్ గురించి తనదైన శైలిలో సెటైర్లు వేసాడు మెగాస్టార్.

ఆయన మాట్లాడుతూ ‘చిన్న జోక్ చెప్తాను.ఎవ్వరిని కించపర్చడానికి చెయ్యడానికి కాదు. టేక్ ఇట్ ఈజీ ! వెబ్ సైట్స్ 2.25 అలా రేటింగ్ ఇచ్చాయి. వాళ్లు ఇచ్చిన రేటింగ్ ఏమిటో తెలుసా 2.25 అంటే .. మిలియన్స్ అని.. 2.25 మిలియన్స్ అని తర్వాత అర్థం అయింది’ అంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.