Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా లో ఫుల్ యాక్టీవ్ గా ఉంటాడు అనే విషయం అందరికీ తెలిసిందే..ఆయన వాడే రేంజ్ లో సోషల్ మీడియా ని నేటి తరం కుర్రహీరోలు కూడా వాడరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..తన వ్యక్తిగత విషయాలతో పాటు తన సినిమాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాడు మన మెగాస్టార్ చిరంజీవి..లేటెస్ట్ గా ఆయన తన ట్విట్టర్ ఖాతా నుండి రామ్ చరణ్ – ఉపాసన మొదటి సంతానం కి జన్మనివ్వబోతున్నారు అంటూ అధికారికంగా ప్రకటించాడు.

సుమారు పదేళ్ల నుండి ఈ శుభవార్త కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్, ఈ వార్త ని ఒక పండుగలాగా జరుపుకున్నారు..ఇప్పుడు లేటెస్ట్ గా చిరంజీవి వేసిన మరో ట్వీట్ సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిపోయింది..’మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది..సాయంత్రం ఆరు గంటలకు అందరూ నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ కి రండి’ అంటూ చిరంజీవి పెట్టిన ఒక ట్వీట్ బాగా వైరల్ అయ్యింది.
ఇంతకీ మెగాస్టార్ చిరంజీవి ఇవ్వబోతున్న ఆ సర్ప్రైజ్ ఏమిటి..?, తన లేటెస్ట్ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ కి సంబంధించి ఏమైనా చెప్పబోతున్నాడా..?, లేదా రామ్ చరణ్ – ఉపాసన కి సంబంధించిన విషయం చెప్పబోతున్నాడా అని అభిమానులు ఆలోచిస్తున్నారు..’వాల్తేరు వీరయ్య’ కి సంబంధించిన రెండవ పాట ని త్వరలోనే విడుదల చేయబోతున్నారనే విషయం అందరికీ తెలిసిందే..దానికి సంబంధించిన అప్డేట్ ఉంటుందేమో అని అభిమానులు అనుకుంటున్నారు.

మరోపక్క తల్లిదండ్రులు అవ్వబోతున్న రామ్ చరణ్ – ఉపాసన కి శుభాకాంక్షలు తెలియచెయ్యడానికి పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి వచ్చాడని..ఆ సందర్భంగా తీసిన వీడియో ని, కుటుంబం తో ఆయన కలిసి గడిపిన ఆ మధుర క్షణాలను వీడియో గా తీసి విడుదల చెయ్యబోతున్నారని కొంతమంది అభిమానులు చెప్తున్నారు..వీటిల్లో ఏది నిజమో తెలియాలంటే మరో రెండు గంటలు వేచి చూడాల్సిందే.