Pawan Kalyan Help: పవన్ కళ్యాణ్ ఒక మాట ఇచ్చాడు అంటే అది శిలాశాసనం లెక్క ఉంటుందని ఆయన చుట్టూ ఉన్న సన్నిహితులు, ఆయన ద్వారా సహాయం పొందినవాళ్ళు మరియు అభిమానులు చెప్తూ ఉంటారు..దేశం లో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయని సేవాకార్యక్రమాలు పవన్ కళ్యాణ్ చేసాడు..కౌలు రైతులను ప్రభుత్వాలు సైతం పట్టించుకోవడం మానేస్తే, వాళ్ళని పవన్ కళ్యాణ్ పట్టించుకున్నాడు..ఆత్మహత్య చేసుకున్న ప్రతీ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తానని మాట ఇచ్చి, తన సొంత డబ్బులు 30 కోట్ల రూపాయిలు సహాయం చేసాడు.

అయితే ఒక సందర్భం లో ముస్లిం మైనారిటీ కి చెందిన ఒక కౌలు రైతు చనిపోతే అతని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్..ఈ సందర్భంగా ఆ కౌలు రైతు కూతురుతో కాసేపు చర్చించాడు..తనకి SI అవ్వాలనే కోరిక ఉందని..కానీ ఆర్ధిక పరిస్థితుల కారణం గా చదువుకోలేకపోతున్నాని చెప్పింది..ఆమె బాధని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే కౌలు రైతు భరోసా కార్యక్రమం ని చేపట్టబోతున్నానని..అందులో భాగంగా నిన్ను కచ్చితంగా SI ట్రైనింగ్ కి పంపే బాధ్యత ని నేను తీసుకుంటానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు.

ఈ ఏడాది ఏప్రిల్ 12 వ తేదీన పవన్ కళ్యాణ్ ఆ మాట ఇస్తే, నిన్న ఆ మాటని నెరవేర్చుకున్నాడు..ఆయన సహాయం పొందిన హలీమా మీడియా ముందుకి వచ్చి మాట్లాడుతూ ‘నువ్వు ఏమి చదువుకున్నావ్ అమ్మా అని సార్ అడిగారు..గ్రాడ్యుయేషన్ చేశాను సార్ అని చెప్పను..నువ్వు ఏమి అవ్వాలనుకుంటున్నావ్ అని అడిగారు..సార్ నేను SI అవ్వాలనుకుంటున్నాను..కానీ ట్రైనింగ్ కి చాలా ఇబ్బందిగా ఉంది, వెళ్ళలేకపోయాను అంటే నేను సపోర్ట్ చేస్తాను అమ్మా నువ్వు వెళ్తాను అంటే కాన్ఫిడెంట్ గా,కచ్చితంగా నిన్ను సపోర్ట్ చేసి నేను ట్రైనింగ్ కి పంపిస్తానని మాట ఇచ్చారు..ఆరోజు సార్ చెప్పినట్టే ఈరోజు మమల్ని పంపిస్తున్నారు..ఈ మైనారిటీ కుటుంబం లో పుట్టినవారికి, ఓట్ల కోసం సహాయం చేస్తాము అని చెప్పి తర్వాత పట్టించుకోకుండా వెళ్లిన రాజకీయనాయకులనే ఇదివరకు చూసాము..కానీ పవన్ కళ్యాణ్ గారు మమల్ని గుర్తు పెట్టుకొని ట్రైనింగ్ కి పంపిస్తున్నందుకు చాలా థాంక్స్ చెప్తున్నాను’ అని ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
