Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు..ఇప్పటి వరుకు విడుదలైన చిరంజీవి మరియు రవితేజ స్పెషల్ టీజర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడమే కాకుండా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ‘బాస్ పార్టీ’ సాంగ్ సెన్సేషనల్ చార్ట్ బస్టర్ సాంగ్ అయ్యింది..ఎక్కడ చూసిన ఇప్పుడు ఈ పాటనే వినిపిస్తుంది..ఇలా ఇప్పటి వరకు విడుదలైన వాల్తేరు వీరయ్య కంటెంట్ మొత్తం సినిమా పై పాజిటివ్ బజ్ ని అమాంతం పెంచేసింది.

ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా వంద కోట్ల రూపాయలకు పైగా జరిగింది..శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జనవరి 13 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది..మెగాస్టార్ గత రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపొయ్యేసరికి..ఈ మూవీ తో మెగాస్టార్ కి ఎలా అయినా బంపర్ హిట్ ద్వారా సంక్రాంతి కానుకగా ఇవ్వాలని అభిమానులు ఫిక్స్ అయ్యారు.
ఇక ఈ చిత్రం లో చిరంజీవి – రవితేజ సవతి అన్నదమ్ములుగా నటిస్తున్నారు..రవితేజ ఒక పవర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంటే,మెగాస్టార్ చిరంజీవి దండాలు, సెటిల్మెంట్స్ చేసే ఒక మాస్ జాలరి పాత్రలో నటించాడు..అయితే ప్రథమార్థం మొత్తం చిరంజీవి – రవితేజ మధ్య గొడవలే ఉంటాయట..ఇంటర్వెల్ సన్నివేశం లో ఒకరి పై ఒకరు తలపడుతారు కూడా..అయితే ఈ సినిమా లో చిరంజీవి ని రవితేజ ఒక సన్నివేశం అరెస్ట్ చేసి జైలుకి తరలిస్తాడట..మెగాస్టార్ ని రవితేజ అరెస్ట్ చెయ్యడమా..ఇలాంటి సన్నివేశాలను మేము ఒప్పుకోము అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కాసేపు రచ్చ చేసారు..ఆ సన్నివేశానికి సంబంధించిన పోస్టర్ ని ఈరోజు విడుదల చేసింది మూవీ టీం.

ఈ చిత్ర డైరెక్టర్ బాబీ మైత్రీ మూవీ మేకర్స్ వేసిన ట్వీట్ ని క్వాట్ చేస్తూ ‘అభిమానులందరూ రాసిపెట్టుకోండి..ఈ సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలవబోతుంది..ఫ్యాన్స్ కి పూనకాలే’ అని చెప్తాడు..చిరంజీవి ని ఎంత మాస్ గా అయితే అభిమానులు చూడాలనుకుంటున్నారో, అంతకుమించి మాస్ గా ఈ సినిమాలో చూపించాడట డైరెక్టర్ బాబీ..మరి అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే మరో నెల రోజులు వేచి చూడాల్సిందే.