NTR – Koratala Siva Movie Teaser: #RRR వంటి సంచలన విజయం తర్వాత ఎన్టీఆర్ కి పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపు లభించింది..ఆ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ మొత్తాన్ని ఎన్టీఆర్ వేస్ట్ చేసుకుంటున్నాడు అని అభిమానులు ఆందోళన చెందుతూ వస్తున్నారు..ఎందుకంటే #RRR చిత్రం విడుదలై ఏడాది గడుస్తున్నా కూడా ఇప్పటి వరుకు కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించలేదు..కొరటాల శివ తో ఆయన ఒక సినిమా చేయబోతున్నాను అని ఎప్పుడో ప్రకటించినప్పటికీ ఇప్పటి వరుకు కనీసం పూజా కార్యక్రమాలకు కూడా నోచుకోలేదు ఈ ప్రాజెక్ట్.

పాన్ ఇండియా స్టార్ ఇమేజి ఉన్న ఎన్టీఆర్ కోసం కొరటాల శివ అంతకుముందు మామూలు సబ్జెక్టు సిద్ధం చేసాడని..ఆ కథ కాకుండా పాన్ ఇండియా రేంజ్ స్కోప్ ఉన్న కథతో మీ ముందుకు వస్తానని..నాకు కొంత సమయం ఇవ్వమని కొరటాల శివ ఎన్టీఆర్ ని రిక్వెస్ట్ చేసినట్టు గతం లో వార్తలు వచ్చాయి..ఎన్టీఆర్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కొరటాల కోసం ప్రత్యేకమైన టీం ని ఏర్పాటు చేసి స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేయించేసాడు.
ఎన్టీఆర్ కి కూడా కథ బాగా నచ్చడం తో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించబోతున్నట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్..సంక్రాంతి రోజున పూజా కార్యక్రమాలు చేయబోతున్నారట..అదే రోజు ఈ మూవీ కి సంబంధించిన ఒక స్పెషల్ టీజర్ ని కూడా సిద్ధం చెయ్యబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ఈ చిత్రం మొత్తం అండర్ వాటర్ నేపథ్యం లో కొనసాగుతుందట..భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటుగా, ఎమోషనల్ మోతాదు కూడా ఎక్కువగా ఉంటుందని సమాచారం.

ఈ చిత్రానికి సౌత్ ఇండియన్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా చలామణీ అవుతున్న అనిరుధ్ సంగీతం అందించబోతుండగా, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈ చిత్రం లో హీరోయిన్ గా దాదాపుగా ఖరారు అయిపొయినట్టే అని వార్తలు వినిపిస్తున్నాయి..దీని గురించి అధికారిక ప్రకటన ఒక్కటే బ్యాలన్స్ ఉంది..ఆచార్య లాంటి ఫ్లాప్ తగిలిన తర్వాత ఎలా అయినా ఈసారి పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే రేంజ్ హిట్ కొట్టాలనే కసితో ఈ సినిమా స్క్రిప్ట్ ని తయారు చేసాడట కొరటాల శివ.