Megastar Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు. ఆపదలో తన ఇంటికి వచ్చిన అభిమాని కష్టాలకు కరిగిపోయాడు. అతడిని చావుఅంచుల్లోంచి బయటపడేశారు. చిరంజీవి చేసిన ఈ పని ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. చిరంజీవి ఎంత మంచి మనసు అంటూ అందరూ కొనియాడుతున్న పరిస్థితి నెలకొంది.
చిరంజీవి స్వగ్రామం మొగల్తూరుకు చెందిన నాగరాజుకు మెగాస్టార్ అంటే అంతులేని అభిమానం. చిన్నప్పటి నుంచి చిరంజీవి పాటలు పాడుతూ వింటూ, డ్యాన్స్ చేస్తూ ఆయనంటే పిచ్చిగా ప్రేమించేవాడు. అయితే విధి నాగరాజుతో విషాద గీతం ఆలపించింది.అతడి రెండు కిడ్నీలు పాడైపోయి చావు అంచులకు చేరాడు.
ఇక చావడమే గతి అనుకొని తన ఇష్ట దైవంగా భావిస్తున్న చిరంజీవిని కలవడానికి హైదరాబాద్ వచ్చాడు. చిరంజీవిని ఎలాగోలా కష్టపడి ఆయన ఇంట్లో కలిశాడు. నాగరాజు కష్టాలకు మెగాస్టార్ కరిగిపోయాడు. ఎమోషనల్ అయ్యారు.
తన అభిమాని చావకూడదని నిర్ణయించుకున్న చిరంజీవి వెంటనే వైద్యులతో మాట్లాడి నాగరాజుకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయడానికి ఏర్పాట్లు చేశాడు. తన సొంత డబ్బులతో నాగరాజుకు కిడ్నీ ఆపరేషన్ తోపాటు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా కూడా ఆదుకుంటానని మెగాస్టార్ భరోసా కల్పించాడు.
ఈ సందర్భంగా నాగరాజు ఆయన తల్లి చిరంజీవి దయాగుణానికి కరిగిపోయి కృతజ్ఞతలు తెలిపారు. చిరు లాంటి హీరో కలకలాం వర్ధిల్లాలని తడిసిన కళ్లతో ఉద్వేగంతో చేతులెత్తి నమస్కరించారు.