Chiranjeevi- Director Bobby: మెగాస్టార్ చిరంజీవి నుండి ఎప్పటి నుండో అభిమానులు ఒక సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్నారు..రీ రెంటరీ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో తన బాక్స్ ఆఫీస్ పవర్ ఏమిటో అందరికీ రుచి చూపించాడు..సినిమాలకు విరామం ఇచ్చినప్పటికీ కూడా తన ఇమేజి చెక్కుచెదరలేదని ఈ సినిమాతో నిరూపించాడు మెగాస్టార్..ఇక ఆ తర్వాత విడుదలైన ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రం కూడా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది కానీ , మెగా అభిమానులు కోరుకునే అంశాలు ఏమి లేకపోవడం తో లాంగ్ రన్ పెద్దగా రాలేదు.

ఇక ఆ తర్వాత విడుదలైన ‘ఆచార్య’ సినిమా ఎంత ఫ్లాప్ అయ్యిందో మనకి తెలిసిందే..ఆ తర్వాత వచ్చిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం కూడా అంతంత మాత్రమే ఆడింది..అలా సరైన హిట్టు కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిరంజీవి ఫ్యాన్స్ కి ఈ సంక్రాంతి మామూలు కిక్ ని ఇవ్వలేదనే చెప్పాలి.
డైరెక్టర్ బాబీ మెగాస్టార్ చిరంజీవిని ‘వాల్తేరు వీరయ్య’ గా చూపించిన విధానానికి కోట్లాది మంది అభిమానులు జేజేలు పలికారు..రివ్యూస్ మరియు రేటింగ్స్ అసలు బాగలేకపోయినా ఈ చిత్రాన్ని జనాలు ఎగబడిమరీ చూసారు..ఈ సంక్రాంతికి పోటీ గా ఎన్ని సినిమాలు మెగాస్టార్ కి ఎదురొచ్చిన నిలబడలేకపోయాయి..అభిమానులు సంబరాలు చేసుకున్నారు..రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ కి ముచ్చటగా మూడవ సారి వంద కోట్ల రూపాయిల షేర్ సినిమాని ఇచ్చారు..ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత చిరంజీవి లో చాలా కాలం తర్వాత ఒక సంపూర్ణమైన ఆనందం కనిపించింది.

ఈ చిత్రం ప్రొమోషన్స్ సమయంలోనే చిరంజీవి ముఖం లో విజయోత్సాహం కనిపించింది..డైరెక్టర్ బాబీ ని పొగడ్తలతో మించి ఎత్తేసాడు..విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టైన తర్వాత బాబీ ని ప్రత్యేకంగా ఆహ్వానించి ఇంట్లో విందు భోజనం ఇచ్చి , విలువైన కారుని బహుమతిగా ఇచ్చి పంపాడట..ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఈ కారు విలువ సుమారుగా రెండు కోట్ల రూపాయిల వరకు చేస్తుందని సమాచారం.