IT Raids On Tollywood: ఇటీవల కాలంలో సినీ నిర్మాతగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని నిర్మిస్తూ హిట్టు మీద హిట్టు కొడుతూ టాప్ నిర్మాతగా ఎదిగిపోయాడు సూర్య దేవర నాగవంశీ..ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ప్రోత్సాహం తో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ని స్థాపించి ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించాడు..న్యాచురల్ స్టార్ నాని తో ఈ నిర్మాణ సంస్థ నుండి వచ్చిన జెర్సీ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, నేషనల్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది.

ఇక ఆ తర్వాత ఈ బ్యానర్ లో చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది DJ టిల్లు చిత్రం..అలా నిర్మాతగా సక్సెస్ లు అందుకుంటూ ఒక్కో మెట్టు ఎదుగుతున్న నాగవంశీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ అనే సూపర్ హిట్ సినిమా తీసే రేంజ్ కి ఎదిగాడు..ఈ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాని నిర్మిస్తున్నాడు..ఈ సినిమా తో పాటుగా కుర్ర హీరోలతో సమాంతరంగా రెండు మూడు ప్రాజెక్ట్స్ ని తెరకెక్కిస్తున్నాడు..ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఈ రేంజ్ కి ఎదిగిన నాగ వంశీ పై IT అధికారులు నిఘా వేశారు..నిన్న సితార ఎంటర్టైన్మెంట్స్ ఆఫీస్ మొత్తం ఐటీ అధికారులు సోదా చేసినట్టు సమాచారం..నాగవంశీ ని కూడా చాలాసేపటి వరకు లావాదేవీల గురించి విచారణ చేసారు..ఆ తర్వాత ఏమి జరిగింది అనేది తెలియాల్సి ఉంది.

నిన్ననే సారధి స్టూడియోస్ లో మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ షూటింగ్ నిర్మాణం ని ప్రారంభించాడు నాగవంశీ..ఈ షెడ్యూల్ చాలా లాంగ్ గా ఉంటుందని సమాచారం..ఈ క్రేజీ కాంబో బిజినెస్ అప్పుడే క్లోజ్ అయిపోయిందని..350 కోట్ల రూపాయలకు థియేట్రికల్ + నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సోషల్ మీడియా లో అభిమానులు ప్రచారం చెయ్యడం దీనిపై కూడా విచారణ జరిపారట ఐటీ అధికారులు.