Megastar Chiranjeevi: నేడు సింగపూర్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్(Mark Shankar Pawanovich) కి గాయాలు అయిన సంగతి తెలిసిందే. అభిమానులను అత్యంత భయబ్రాంతులకు గురి చేసిన సంఘటన ఇది. ఈరోజు ఉదయం నుండి ఎక్కడ చూసినా ఈ అంశం గురించే చర్చ నడుస్తుంది. ప్రస్తుతానికి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, కాళ్లకు, చేతులకు చిన్నపాటి గాయాలు అయ్యాయని మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నేడు మధ్యాహ్నం మీడియా కి సమాచారం అందించిన సంగతి తెలిసిందే. ఇకపోతే కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి పై స్పందించాడు. అగ్ని ప్రమాదంలో నల్ల పొగ పీల్చడం వల్ల బార్కోస్కోపీ ట్రీట్మెంట్ చేస్తున్నారని, రేపు ఉదయం వరకు వాస్తవ పరిస్థితి పూర్తిగా తెలియదని చెప్పుకొచ్చాడు.
Also Read : పెద్ద కొడుకు పుట్టినరోజున చిన్న కొడుక్కి ఇలాంటి పరిస్థితి వచ్చింది – పవన్ కళ్యాణ్
ఇకపోతే మరికాసేపట్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో సింగపూర్ కి వెళ్లబోతున్నాడు. అయితే అంతకు ముందే చిరంజీవి దంపతులు ప్రత్యేక విమానంలో మార్క్ శంకర్ ని చూసేందుకు వెళ్తున్నారని మీడియా కి ఒక సమాచారం వచ్చింది. ప్రెస్ మీట్ లో ఈ విషయం పై పవన్ కళ్యాణ్ ని ఒక రిపోర్టర్ అడుగుతూ ‘మీతో పాటు చిరంజీవి గారు, సురేఖ గారు వస్తున్నారని వార్తలు వచ్చాయి సార్, నిజమేనా’ అని అడగగా, దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తూ ‘లేదండీ..నేను ఇంకా దీనిపై ఇంట్లో ఎవరితోనూ మాట్లాడలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. బహుశా చిరంజీవి దంపతులు వెళ్తున్న విషయం పవన్ కళ్యాణ్ వరకు సమాచారం వచ్చి ఉండకపోవచ్చు అని అభిమానులు అనుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే జరిగిన ఈ దుర్ఘటన లో ఒక చిన్నారి చనిపోయింది. అదే విధంగా ఒక పవన్ కళ్యాణ్ పక్కనే కూర్చున్న క్లాస్ మేట్ కి థర్డ్ డిగ్రీ బర్నింగ్ జరిగిందట.
ఫైర్ ఇంజిన్ వచ్చే లోపే అక్కడ కంస్ట్రక్షన్ వర్క్ లో ఉన్నవాళ్లు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టడం తో పిల్లలందరూ పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారని, కానీ ఒక బిడ్డ మృతి చెందడం బాధాకరమని పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో ఆవేదన వ్యక్తం చేశాడు. మన్యం జిల్లా పర్యటనలో ఉన్న తనకు మార్క్ కి జరిగిన ప్రమాదం గురించి సమాచారం అందిందని, అందుకోసమే నాలుగు రోజుల టూర్ ని రెండు రోజులకు కుదించామని, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత పర్యటన కొనసాగిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. సమ్మర్ క్యాంప్ సందర్భంగా మార్క్ శంకర్ సింగపూర్ లోని వ్యాలీ రోడ్ లో ఉన్నటువంటి షాప్ హౌస్ లోని టమోటో కుకింగ్ స్కూల్ లో చేరాడు. మార్చి 8న మొదలైన ఈ క్యాంప్, మే వరకు కొనసాగనుంది. ఇలాంటి సమయంలో దుర్ఘటన జరగడం బాధాకరం.
Also Read : వారానికి 43 వేల ఫీజు.. ఏం నేర్పిస్తారంటే? సింగపూర్ స్కూల్ లో జరిగింది ఇదే!