Allu Aravind Dance: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ హీరోయిన్ తో డాన్సులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 18 పేజెస్ టీం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కలెక్షన్స్ ఓ మోస్తరుగా ఉన్నా సెలెబ్రేషన్స్ మాత్రం గట్టిగా చేసుకుంటున్నారు. పార్టీల్లో తేలియాడుతున్నారు. 18 పేజెస్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అల్లు అరవింద్, సుకుమార్ లతో పాటు చిత్ర యూనిట్ నైట్ పార్టీలో పాల్గొన్నారు. ఈ పార్టీలో అల్లు అరవింద్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో పాటు డాన్స్ చేశారు. ఈ వీడియోలో ఆయన ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించారు.

ఆయన డాన్స్ చేస్తూ ఇతరులను ఎంకరేజ్ చేశారు. అల్లు అరవింద్-అనుపమ కలిసి డాన్స్ చేస్తుండగా వారితో సుకుమార్ జాయిన్ అయ్యారు. అనుపమ బలవంతపెట్టడంతో ఆయనకు తప్పలేదు. ఈ అరుదైన సంఘటనను నిఖిల్ షూట్ చేశారు. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ క్రమంలో అనుపమ-అల్లు అరవింద్ ల డాన్స్ వీడియో వైరల్ గా మారింది. టాక్, వసూళ్లతో సంబంధం లేకుండా 18 పేజెస్ తో నిర్మాతలకు బాగా డబ్బులు వచ్చాయని తెలుస్తుంది.
18 పేజెస్ చిత్ర బడ్జెట్ రూ. 14 కోట్లు అట. నాన్ థియేట్రికల్ రైట్స్ రూ. 22 కోట్లకు అమ్మడుపోయాయట. అంటే శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారానే రూ. 8 కోట్ల లాభం వచ్చింది. ఇక థియేటర్స్ లో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ ఓన్ రిలీజ్ చేశారట. ప్రేక్షకులు కొనే టికెట్ ద్వారా వచ్చే ప్రతి రూపాయి గీతా ఆర్ట్స్ వాళ్లకు చెందుతుంది. 18 పేజెస్ ఐదు కోట్లు వసూలు చేసినా పది కోట్లు వసూలు చేసినా … నష్టం ఏమీ లేదు. ఎందుకంటే నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే లాభాలు రాగా, కలెక్షన్స్ రూపంలో ఎంత వచ్చినా, అది అదనంగా వచ్చే లాభం అవుతుంది.

ఈ లెక్కలను నిఖిల్ స్వయంగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. సుకుమార్ సహనిర్మాత. ఆయన శిష్యుడు సూర్య ప్రతాప్ పలనాటి 18 పేజెస్ తెరకెక్కించారు. ఎమోషనల్ లవ్ అండ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్-అనుపమ మరోసారి జతకట్టారు.
View this post on Instagram