
Meera Jasmine: ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవడం అంటే ఇదేనేమో. ఒకప్పుడు హోమ్లీ హీరోయిన్ గా స్టార్డం అనుభవించిన మీరా జాస్మిన్ స్కిన్ షో చేస్తుందని ఊహించి ఉండరు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ మీరా జాస్మిన్ బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో మీరా జాస్మిన్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. అప్పట్లో ఆమెకు భారీ ఇమేజ్ ఉండేది. 2001లో విడుదలైన సూత్రధారన్ మూవీతో మీరా వెండితెరకు పరిచయమయ్యారు. ఆమెకు రన్ మూవీ బ్రేక్ ఇచ్చింది.
మాధవన్ హీరోగా నటించిన లవ్ డ్రామా రన్ లో మీరా జాస్మిన్ లుక్ కుర్రాళ్లను కట్టిపడేసింది. దర్శకుడు లింగుస్వామికి రన్ మంచి పేరు తెచ్చింది. తమిళ, మలయాళ భాషల్లో వరుసగా చిత్రాలు చేశారు. విశాల్ హీరోగా తెరకెక్కిన పందెంకోడి తెలుగులో కూడా మంచి విజయం అందుకుంది. ఆ మూవీ మీరా జాస్మిన్ కి తెలుగులో క్రేజ్ తెచ్చింది. ఆమె తెలుగులో నటించిన మొదటి చిత్రం అమ్మాయి బాగుంది.
ఇక పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి టాప్ స్టార్స్ తో మీరా నటించారు. గుడుంబా శంకర్, మహారథి చిత్రాల్లో ఆమెకు టాప్ స్టార్స్ పక్కన ఛాన్స్ దక్కింది. అయితే ఈ రెండు చిత్రాలు నిరాశపరిచాయి. తెలుగులో మీరా జాస్మిన్ నటించిన అతిపెద్ద బ్లాక్ బస్టర్ భద్ర. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన భద్ర మూవీలో రవితేజ హీరోగా నటించారు. లవ్, యాక్షన్ కలగలిపి కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కించారు.

2010 తర్వాత మీరా జాస్మిన్ కెరీర్ బాగా నెమ్మదించింది. అన్ని భాషల్లో ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. తెలుగులో మీరా జాస్మిన్ నటించిన చివరి చిత్రం మోక్ష. అది 2013లో విడుదలైంది. కెరీర్ డల్ అయ్యాక మీరా జాస్మిన్ దుబాయ్ లో ఇంజనీర్ అయిన అనిల్ జాన్ టైటస్ ని వివాహం చేసుకున్నారు. ఈమె మారీడ్ లైఫ్ కూడా సవ్యంగా సాగలేదని సమాచారం. 2008లో మీరా జాస్మిన్ ని మలయాళ పరిశ్రమ బ్యాన్ చేసింది.
2018 తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న మీరా జాస్మిన్ 2022 మకల్ టైటిల్ తో ఓ మూవీ చేశారు. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. కొన్నాళ్ల నుండి సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిన మీరా జాస్మిన్ బోల్డ్ ఫోటోలు షేర్ చేయడం షాకింగ్ పరిణామం. ఇరవై ఏళ్ల కెరీర్లో మీరా ఎప్పుడూ స్కిన్ షో చేయలేదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోగా ఆమె ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తున్నారు.