Matti Kusthi Collections: మాస్ మహారాజ రవితేజ నిర్మాతగా మారి తెలుగులో సమర్పించిన ‘మట్టి కుస్తీ’ అనే చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు తమిళం బాషలలో ఘనంగా విడుదలైంది..తమిళం లో మాస్ హీరో గా పేరు తెచ్చుకున్న విష్ణు విశాల్ ఈ సినిమాలో హీరో గా నటించగా..ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించింది..టీజర్ మరియు ట్రైలర్ తోనే మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అని ప్రేక్షకుల్లో ఒక ముద్ర వేసేసింది ఈ చిత్రం..దానికి తోడు తెలుగు ప్రొమోషన్స్ లో రవితేజ చురుగ్గా పాల్గొనడం.

హీరో విష్ణు విశాల్ తో కలిసి ప్రత్యేకమైన ఇంటర్వూస్ ఇవ్వడం వల్ల ఈ సినిమాకి ఒక బజ్ అయితే ఏర్పడింది..టాక్ కూడా పర్వాలేదనే రేంజ్ లో వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం చిల్లరే వస్తుంది..రవితేజ బ్రాండ్ ఓపెనింగ్స్ వరుకు అయినా ఉపయోగపడుతుంది అనుకున్నారు కానీ పెద్ద పెద్ద సిటీస్ లో సైతం కలెక్షన్స్ చాలా డల్ గా ఉన్నాయి..మొదటి రోజు ఎంత వసూళ్లను రాబట్టే అవకాశం ఈ సినిమాకి ఉందొ ఒకసారి చూద్దాము.
ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా రెండు కోట్ల రూపాయలకు జరిగింది..ఊరు పేరు తెలియని హీరో సినిమాకి ఇంత బిజినెస్ జరగడానికి ప్రధాన కారణం మాస్ మహారాజ రవితేజ బ్రాండ్..కానీ మొదటి రోజు అన్ని ప్రాంతాలకు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 30 లక్షల షేర్ వసూళ్లు కూడా వచ్చేలా కనిపించడం లేదు..ఏ సినిమాకైనా వీకెండ్ చాలా కీలకం..ఈ చిత్రానికి టాక్ బాగుంది కాబట్టి వీకెండ్ లో పుంజుకున్న కూడా మూడు రోజులకు కలిపి కోటి రూపాయిల షేర్ వస్తే గొప్ప అన్నట్టు ఉంది పరిస్థితి..కానీ ఇప్పుడు నాన్ థియేట్రికల్ కూడా పెద్ద బిజినెస్ అయిపోవడం తో నిర్మాతగా రవితేజ కి పెద్దగా నష్టాలు కలగకపోవచ్చు కానీ, థియేట్రికల్ బిజినెస్ పరంగా మాత్రం అతనికి నష్టమే అని చెప్పాలి.

దానికి తోడు ఈరోజు యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ‘హిట్ 2 ‘ కూడా విడుదలవ్వడం..ఆడియన్స్ కి మొదటి ఛాయస్ అదే అవ్వడం కూడా ఈ సినిమా ఓపెనింగ్స్ పై బలమైన దెబ్బ పడింది..ఎటు చూసుకున్నా ఈ సినిమాకి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి చూస్తుంటే ఫ్లాప్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు.