Karnataka Blast: దేశం ఐటీ రాజధాని బెంగళూరు. ప్రశాంతంగా ఉండే నగరంలో శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా అలజడి రేగింది. నగరంలోని ఫేమస్ అయిన రామేశ్వరంలో కేఫ్‌లో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో ఆందోళనకు గురైన జనం భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఐదుగురు గాయపడగా, వీరిలో కేఫ్ సిబ్బంది ఉన్నారు.
సిలిండర్ పేలిందని..
రామేశ్వరం కేఫ్‌లో సిలిండర్ పేలిందన్న సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని నలుగురిని కాపాడారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో అందరూ పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేశారు. పేలుడు థాటికి కేఫ్ మొత్తం ధ్వంసమైంది.
పేలుడు వెనుక కుట్ర..
ఇక ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సిలిండర్ పేలిందా లేక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాపు చేశారు. రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ కీలక ఆధారాలు సేకరించింది. ప్రచారం జరిగినట్లు కేఫ్‌లో సిలిండర్ పేలిన ఆనవాళ్లు లేవని నిర్ధారించింది. అదే సమయంలో కేఫ్‌లో ఎలక్ట్రిక్ వైర్లు ఉన్నట్లు గుర్తించింది. నట్లు, బోల్టులను కూడా గుర్తించారు. టిఫిన్ బాంబు పేలినట్లు అనుమానిస్తున్నారు.
రంగంలోకి ఎన్‌ఐఏ టీం..
కేఫ్‌లో పేలుడుపై పోలీసులు, బాంబ్ స్క్వాడ్ అనుమానం వ్యక్తం చేయడంతో ఎన్‌ఐఏ రంగంలోకి దిగింది. దర్యాప్తు ముమ్మరం చేసింది. టిఫిన్ బాంబు పేలినట్లు గుర్తించారు. ఈమేరకు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. సంచిని ఓ వ్యక్తి కేఫ్‌లో పెట్టినట్లు అందులో గుర్తించారు. ఆ తర్వాతే పేలుడు జరగడం, తీగలు, నట్లు, బోల్టులు లభించడంతో ఐఈడీ పేల్చినట్లు నిర్ధారించారు. ఈమేరకు కర్ణాటక సీఎం కూడా ప్రకటించారు. కేఫ్‌లో బాంబు పేలిందని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై రామేశ్వరం కేఫ్ వ్యవస్థాపకుడు నాగరాజుతో తాను మాట్లాడానని, పేలుడు గురించి ఆరా తీశానని బీజేపీ నేత, ఎంపీ తేజశ్వియాదవ్ ట్వీట్ చేశారు. కేఫ్‌లో సిలిండర్ పేలలేదని, కస్టమర్ ముసుగులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి వదిలి వెళ్లిన బ్యాగు కారణంగానే పేలుడు జరిగినట్లు పేర్కొన్నారు.