
Pawan Kalyan- Sai Dharam Tej: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా వరుస సినిమాలను ఒప్పుకుంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.ఒక పక్క రాజకీయాలు చేస్తూనే మరో పక్క సినిమాలు చేస్తూ అభిమానులకు ఎక్కడలేని హై ఇస్తున్నాడు.రీసెంట్ గానే ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘#OG’ సినిమాలను ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు లేటెస్ట్ గా సాయి ధరమ్ తేజ్ తో తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా సీతం’ రీమేక్ లో నటిస్తున్నాడు.
మొన్ననే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ దాదాపుగా 20 నుండి 25 రోజుల డేట్స్ ఇచ్చాడు.సముద్ర ఖని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు.కేతిక శర్మ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ మధ్య ఒక అదిరిపొయ్యే మాస్ సాంగ్ ని సిద్ధం చేస్తున్నారట.ఇందులో వీళిద్దరితో పాటుగా ఒక ప్రముఖ టాప్ హీరోయిన్ కూడా చిందులు వెయ్యబోతుంది.ఒరిజినల్ వెర్షన్ లో ఎలాంటి పాటలు మరియు ఫైట్స్ ఉండవు.కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ నుండి అభిమానులు ఏవైతే కోరుకుంటారో అవన్నీ ఉంటాయట.

అంతే కాకుండా లుక్స్ పరంగా కూడా ఫ్యాన్స్ కి పూనకాలు రప్పించే రేంజ్ లో ఎంతో స్టైలిష్ గా ఉండబోతుందట.మొన్న షూటింగ్ లాంచ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ కనిపించిన లుక్ కి సోషల్ మీడియా లో ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే.సినిమాలో అంతకంటే అందం గా కనిపించబోతున్నాడట.దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు.తమిళం లో మంచి ఫీల్ గుడ్ సినిమా గా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ ని దక్కించుకుంటుందో చూడాలి.