
Lakshmi Pranathi- Upasana: రామ్ చరణ్- ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. గత ఐదేళ్లుగా వీరి మధ్య స్ట్రాంగ్ బాండింగ్ కొనసాగుతుంది. ఆర్ ఆర్ ఆర్ ప్రకటించక ముందు నుంచే రామ్ చరణ్,ఎన్టీఆర్ లకు దోస్తీ ఉంది. సతీసమేతంగా కలిసి వేడుకలు చేసుకునేవారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో అది మరింత బలపడింది. వీరి సతీమణులు ఉపాసన, లక్ష్మి ప్రణతి కూడా మంచి దోస్తులు. కాగా యంగ్ ఎంట్రప్రెన్యూర్ అయిన ఉపాసన తన ఫ్రెండ్ కోసం లక్షల విలువ చేసే గిఫ్ట్ ఇచ్చిందట. అది లక్ష్మి ప్రణతికి పిచ్చపిచ్చగా నచ్చేయగా… ఎక్కడికెళ్లినా దాన్ని వదలడం లేదట.
ఇంతకీ లక్ష్మి ప్రణతికి ఉపాసన ఇచ్చిన బహుమతి ఏంటంటే… హ్యాండ్ బ్యాంగ్. చాలా స్టైలిష్ అండ్ ట్రెండీగా ఉన్న ఈ బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ ధర ఏకంగా రూ. 3.28 లక్షలు అట. అలాగే నలభై వేల విలువ చేసే ఓ డ్రెస్ కూడా కొనిచ్చారట. ఉపాసన ఇచ్చిన గిఫ్ట్స్ లక్ష్మి ప్రణతిని ఆనందంలో ముంచేశాయట. దీంతో ఇద్దరి మధ్య స్నేహం మరింత స్ట్రాంగ్ అయ్యిందంటున్నారు. ఈ మేరకు ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.
కాగా ఇతర స్టార్ హీరోల భార్యలతో పోల్చుకుంటే లక్ష్మి ప్రణతి చాలా సైలెంట్. ఆమె సోషల్ మీడియా వాడరు. పెద్దగా బయట ఫోకస్ కారు. అరుదుగా ఎన్టీఆర్ తో పాటు మాత్రమే కనిపిస్తుంటారు. లక్ష్మి ప్రణతి ఫాదర్ నార్నె శ్రీనివాసరావు వ్యాపారవేత్త. ఎన్టీఆర్ తో ఆమెది అరేంజ్డ్ మ్యారేజ్. ఆ మధ్య ఆమె తమ్ముడు సినిమాల్లోకి వస్తున్నాడని ప్రచారం జరిగింది. తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇక ఉపాసన అపోలో గ్రూప్ వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే పలు రంగాల్లో ఆమె రాణిస్తున్నారు.

ఇటీవల జరిగిన రామ్ చరణ్ బర్త్ డే వేడుకలకు ఎన్టీఆర్ దంపతులు హాజరు కాలేదు. ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ కి బెస్ట్ విషెస్ మాత్రం చెప్పారు. చరణ్ బర్త్ డే పార్టీకి ఎన్టీఆర్ రాకపోవడంతో కొన్ని పుకార్లు తెరపైకి వచ్చాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీ క్రెడిట్ ఎవరికి దక్కిందనే విషయంలో ఎన్టీఆర్ – చరణ్ మధ్య మనస్పర్థలు తలెత్తాయని, అందుకే ఎన్టీఆర్ రాలేదంటూ ఓ వాదన వినిపిస్తోంది.