Manchu Laxmi Photoshoot : లక్ష్మీ ప్రసన్న అలియాస్ మంచు లక్ష్మి ఫేమ్ కోసం చేయని ప్రయత్నం లేదు. నటిగా, హీరోయిన్ గా, టెలివిజన్ హోస్ట్ గా అనేక అవతారాలు ఎత్తారు . కానీ ఆమె కోరుకున్న గుర్తింపు మాత్రం రావడం లేదు. మంచు లక్ష్మి కెరీర్ హాలీవుడ్ లో మొదలు కావడం విశేషం. ఇంగ్లీష్ టెలివిజన్ షోస్ కి ఆమె హోస్ట్ గా వ్యవహరించారు. రెండు మూడు హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు. అయితే పుట్టిన నేలపై తానేంటో నిరూపించుకోవాలని టాలీవుడ్ లో అడుగుపెట్టారు. తెలుగులో ఆమె ఫస్ట్ మూవీ అనగనగా ఒక ధీరుడు. జానపద చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రుతి-సిద్దార్థ్ హీరో హీరోయిన్ గా నటించారు.
మంచు లక్ష్మి లెగ్ పవర్ ఫస్ట్ మూవీతోనే రుజువైంది. భారీ బడ్జెట్ తో అంచనాల మధ్య విడుదలైన అనగనగా ఓ ధీరుడు ఎపిక్ డిజాస్టర్ అని చెప్పాలి. రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. మంచు లక్ష్మి దాదాపు ఇరవైకి పైగా చిత్రాల్లో నటిస్తే ఒక్క మూవీ కూడా హిట్ కాలేదంటే అతిశయోక్తి కాదు. గుండెల్లో గోదావరి, దొంగాట, చందమామ కథలు, లక్ష్మీ బాంబ్ చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా చేశారు.
మంచు లక్ష్మి తన లెగ్ పవర్ ఇటీవల మోహన్ లాల్ కి చూపించింది. ఆయన హీరోగా తెరకెక్కిన మలయాళ చిత్రం మాన్స్టర్ లో మంచు లక్ష్మి నటించారు. మాన్స్టర్ మోహన్ లాల్ కెరీర్లో చెత్త చిత్రంగా అక్కడ జనాలు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సినిమాలు చేయకండని మోహన్ లాల్ కి ఫ్యాన్స్ దండం పెట్టారంటే ఇక అర్థం చేసుకోవచ్చు. సెంటిమెంట్స్ ని మూఢనమ్మకాలు అనుకునేవాళ్లకు మంచు లక్ష్మి గురించి చెబితే గట్టిగా నమ్మేస్తారు. సెంటిమెంట్ మూఢనమ్మకం కాదు అంటారు.
ఇక మంచు లక్ష్మి పెద్ద ట్రోలింగ్ మెటీరియల్. ఆమెను ట్రోల్ చేస్తూ బ్రతికేసే యూట్యూబ్ ఛానల్స్ వందల్లో ఉంటాయి. అయితే మంచు లక్ష్మి ఏంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తి. ఎవరేమనుకున్నా మనసుకు నచ్చింది చేయాలి. ఎంచుకున్న రంగంలో ఎదిగే ప్రయత్నం చేయాలి అంటుంది. జనాలు ఎగతాళి చేస్తారని తమ టాలెంట్ దాచుకునే వాళ్ళు మంచు లక్ష్మిని చూసి నేర్చుకోవాలి. గ్లామరస్ ఫోటో షూట్స్ కూడా చేసే మంచు లక్ష్మి… ట్రోల్స్ మై ఫూట్ అంటుంది. 45 ఏళ్ల మంచు లక్ష్మి లేటెస్ట్ బోల్డ్ ఫోటో షూట్ చూసిన జనాలు… అసలు తగ్గడం లేదుగా అంటున్నారు.