Panakala Swamy Temple: దేశంలోని కొన్ని ఆలయాలు అద్భుతాలకు నెలవు. వేల సంవత్సరాల నాటి ఆలయాలు అప్పటి రాజుల కాలంలో మరింత శోభితంగా పరిఢవిల్లాయి. అత్యద్భుతమైన నిర్మాణ శైలి ఆశ్చర్యాలకు గురిచేస్తుంటాయి. అలాంటి ఆలయాల్లో గుంటూరు జిల్లా మంగళగరిలోని పానకాల స్వామి ఆలయం కూడా ఒకటి. నిత్యం ధూప, దీప నైవద్యాలతో ఆలయంలో జరుగుతుంటాయి. వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటుంటారు. ఈ ఆలయంలో ఉన్న కోనేరు పునర్నిర్నాణం కోసం జరుపుతున్న తవ్వకాల్లో అద్భుతాలు బయల్పడుతున్నాయి.
శ్రీకృష్ణ దేవరాయల కాలంలో..
మంగళగిరి అంటే ఠక్కున గుర్తుచ్చే పేరు పానకాలస్వామి. దీనిని శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. సదాశివ రాయల కాలంలో ఆయన మేనల్లుడు రాజయ్య ఇక్కడ కోనేరు నిర్మించారని అంటుంటారు. దీనిని చీకటి కోనేరు అని కూడా పిలుస్తారు. సుమారు 460 ఏళ్ల క్రితం ఇది నిర్మితమైంది. దాదాపు 40 యేళ్ల క్రితం వరకు ఈ కోనేరులో తెప్పోత్సవం నిర్వహించే వారు. ఆ తరువాత శిథిలావస్థకు చేరుకోవడంతో, వాడకం ఆపేశారు. దాంతో క్రమేణా చెత్త పేరుకుపోయి డంపింగ్ యార్డుల మారిపోయింది. నీరు కూడా పై వరకు వచ్చేసింది.
శ్రీ చక్రం ఆకారంలో కోనేరు
ఇటీవల కాలంలో ఆలయంలోని కోనేరును పునర్నిర్మించే పనులను మొదలుపెట్టారు. అంతుకు మందు సంక్పలించినా సాధ్యపడలేదు. నీటిని తోడేందుకే 4 నెలల కాలం పట్టింది. నీళ్లు తగ్గిపోతున్న కొద్దీ అనేక నిర్మాణాలు బయటపడ్డాయి. ఆంజనేయ స్వామి ఆలయం కోనేరుకు పడమర వైపున ఉంది. దాని ఎదురుగా ధ్వజస్తంభం కూడా నెలకొల్పి ఉన్నారు. ఈశాన్యంలో రెండు శివలింగాలు, తూర్పు వైపు శివలింగాకారంలో స్వాగత తోరణాలు ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి పంచలోహ విగ్రహం కూడా బయల్పడింది. వీటిని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. చతుర్భజం లేదా షడ్భుజం ఆకారంలో కోనేరు ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే, స్థానికులు మాత్రం శ్రీ చక్రం ఆకారం అని అంటున్నారు.
అడుగున సొరంగం
కోనేరులో మొత్తం నీటిని తోడేసిన తరువాత అడుగున పెద్ద సొరంగం బయటపడింది. ఇది 5 అడుగుల వెడల్పుతో ఉంది. మొత్తం బురదతో నిండిపోయి ఉంది. ఇది చేబ్రోలులోని బ్రహ్మ గుడి వరకు ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం బురదను తొలగించే పనులు జరుగుతున్నాయి. నీరు కూడా ఎక్కువగానే వస్తుంది. వీటిని పూర్తి స్థాయిలో తొలగించిన అనంతరం లోపల ఏముందనే విషయం స్పష్టత వస్తుంది. ఎక్కడ వరకు వెళ్లవచ్చనేది తెలుస్తుందని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కొంత మంది సంపద కూడా ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. అసలు విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.