Viral Video: కొన్ని పనులు కొన్ని సమయాల్లో నవ్వులు పూయిస్తాయి. సరదాగా చేసినా అనుకోకుండా చేసినా అది అందరికి నవ్వు తెప్పిస్తుంది. అవగాహన రాహిత్యమో అనుకోకుండా జరిగిన పొరపాటు వల్ల కొన్ని పనులు అందరికి గమ్మత్తుగా అనిపిస్తాయి. నవ్వుల పువ్వులు పూయిస్తాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల కాలం కావడంతో ప్రతి విషయం నెట్టింట్లో వైరల్ గా మారుతోంది. దీంతో హాస్యం కూడా పెరుగుతోంది. దంపతులు ఏ పని చేసినా కలిసే చేస్తారు. ఏ కొత్త పని మొదలెట్టినా భార్యాభర్తలు కలిసి చేయడం సంప్రదాయం. దీంతో ఆ పనిచేయడంలో పొరపాటు జరిగితే అదే పెద్ద వార్త అవుతోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది కూడా అలాంటిదే.

తాజాగా ఓ వృద్ధ దంపతులు ఓ ద్విచక్ర వాహనం కొనుగోలు చేశారు. దీంతో సదరు కంపెనీ ప్రతినిధులు బండికి పూజ చేయించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దండ వేయాల్సిందిగా సూచించారు. దీంతో ఆమె భర్త దండ బండికి వేయకుండా భార్యకు వేయడంతో నవ్వులు పూశాయి. అందరు నవ్వుకున్నారు. ఆయన చేసిన పనికి లోపలే పగలబడి నవ్వుకున్నారు. భర్త కావాలని వేశాడో లేదా ఉద్దేశ పూర్వకంగా వేశాడో కానీ భార్యకు దండ వేయడంతో సదరు కంపెనీ సిబ్బందిలో నవ్వులు విరిశాయి.
భర్త దండను భార్యకు వేయడంతో సిబ్బంది నివారించి దాన్ని బండికి వేయాలని కోరారు. దీంతో భర్త చేసిన పనికి అక్కడ ఉన్న వారందరు కొంతసేపు నవ్వుకోవడం కనిపించింది. సిబ్బంది అరవడంతో ఆయన ఆ దండను తీసి బండికి వేయడం సరదాగా అనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఆ దంపతులు చేసిన పనికి అందరు మనసారా నవ్వుకుంటున్నారు. భార్యపై ఉన్న ప్రేమతోనే దండ వేసేందుకు వెళ్లాడా? లేక కావాలనే అలా చేశాడా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఆ వృద్ధ దంపతులు చేసిన పని అందరిలో హాస్యం తెప్పిస్తోంది.

భర్త చేసిన పనికి భార్య కూడా నవ్వుకుంది. బండికి వేయాల్సిన దండ తనకు వేయడంతో ఆమెలో ఆశ్చర్యం కంటే హాస్యమే కనిపించింది. దీంతో వారిది ఆదర్శ జంటగా భావిస్తున్నారు. బండి మీద కంటే భార్య మీదే అతడికి ప్రేమ ఉందని తెలుస్తోంది. అందుకే దండను బండికి వేయాల్సిన బదులు భార్యకు వేసేందుకు రెడీ అయినట్లు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య సంబంధం అంటే ఇదేనేమో అనే వాదన అందరిలో వస్తోంది. ఈ క్రమంలో షో రూంలో జరిగిన సంఘటన అందరిలో నవ్వులకు కారణమైంది.
Cutest video on internet pic.twitter.com/kJ6AW9xL6V
— Chikoo (@tweeterrant) October 12, 2022