Homeఅంతర్జాతీయంRussian Man: తిమింగళాలను చూసేందుకు పోయి.. సముద్రంలో శవాల మధ్య 67రోజుల పాటు నరకం.. ఎలా...

Russian Man: తిమింగళాలను చూసేందుకు పోయి.. సముద్రంలో శవాల మధ్య 67రోజుల పాటు నరకం.. ఎలా బయటపడ్డాడంటే?

Russian Man : సరదాగా తిమింగలాలను చూసేందుకు సముద్రంలోకి వెళ్లిన ఓ వ్యక్తికి భయానక పరిస్థితి ఎదురైంది. అతని చిన్న పడవ దారి తప్పి భీకర కెరటాల ధాటికి కొట్టుకుపోయింది. దీంతో దాదాపు రెండు నెలల పాటు నరకం అనుభవించాడు. తనతో పాటు వచ్చిన అత్యంత సన్నిహితులు ఇద్దరు చనిపోయినా.. తన బరువులో సగం తగ్గినా.. చివరకు మృత్యుంజయుడిగా నిలిచి బయటపడగలిగాడు. ఫిషింగ్ బోటు సాయంతో బయటపడ్డాడు. అసలు ఏం జరిగిందంటే. రష్యాకు చెందిన మెకాయిల్ పిచుగిన్ అనే వ్యక్తి ఓఖోత్స్క్ సముద్రంలో సరదాగా తిమింగళాలను చూసేందుకు ఆగస్టులో చిన్న పడవలో బయలుదేరి వెళ్లాడు. తనతో పాటు తన సోదరుడు, మేనలుడు కూడా వెళ్లారు. వారితో పాటు 20లీటర్ల నీళ్లు, ఆహార పదార్థాలు తీసుకుని ప్రయాణం మొదలు పెట్టారు. వెళ్లేటప్పుడు సక్సెస్ ఫుల్ గానే ప్రయాణం సాగించారు. కానీ తిరిగి వస్తున్న క్రమంలోనే వారికి అనుకోని సమస్యలు ఎదురయ్యాయి. తిరిగి వస్తున్న క్రమంలో సముద్రంలో తుఫాను ఏర్పడి బలమైన అలల ధాటికి వారు ప్రయాణిస్తున్న పడవ దారి తప్పి కొట్టకుపోయింది. అంతే కాకుండా పడవ ఇంజిన్ కూడా ఫెయిల్ అయింది. అలా వారు ముగ్గురు సముద్రంలో కనిపించకుండా పోయారు. ముగ్గురి ఆచూకీ కోసం అధికారులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

అయితే వారంతా చిన్న పడవలో రెండు నెలలకు పైగా ఉన్నారు. అందులో మెకాయిల్ పిచుగిన్ బతికి ఉండగా తన సోదరుడు, సమీప బంధువు చనిపోయారు. సోమవారం కంచట్కా ద్వీపకల్పం సమీపంలో ఫిషింగ్ ఓడ ద్వారా వ్యక్తిని రక్షించినట్లు రష్యా ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. రష్యన్ వార్తా నివేదికలు బతికి ఉన్న వ్యక్తిని 46 ఏళ్ల మిఖాయిల్ పిచుగిన్‌గా గుర్తించాయి. తన 49 ఏళ్ల సోదరుడు, 15ఏళ్ల తన మేనల్లుడు మరణించినట్లు పేర్కొంది. ఈ ముగ్గురు వ్యక్తులు ఆగస్టు ప్రారంభంలో ఓఖోత్స్క్ సముద్రం వాయువ్య తీరంలోని శాంతర్ ద్వీపానికి ప్రయాణించారని మీడియా నివేదికలు తెలిపాయి. ఖబరోవ్స్క్ ప్రాంతంలోని కేప్ పెరోవ్స్కీ నుండి సఖాలిన్ ద్వీపానికి బయలుదేరిన తరువాత వారు ఆగస్టు 9 న అదృశ్యమయ్యారు. సహాయక చర్యలు ప్రారంభించినప్పటికీ వారిని గుర్తించలేకపోయారు.

దాదాపు 67 రోజుల తర్వాత కమ్ చట్కా ద్వీపం వైపుగా వెళ్తున్న ఓ షిప్పింగ్ పడవకు మెకాయిల్ పిచుగిన్ ఉన్న బోటు కనిపించింది. ఫిషింగ్ ఓడ సిబ్బంది వారి రాడార్‌లో చిన్న పడవను గుర్తించినప్పుడు వారు మొదట్లో అది వ్యర్థపదార్థం అనుకున్నారు. కాని వారు నిర్ధారించుకోవడానికి స్పాట్‌లైట్‌ని ఆన్ చేసి, పిచుగిన్‌ని చూసి ఆశ్చర్యపోయారు. తూర్పు ఆసియాలో అత్యంత శీతలమైన సముద్రం, తుఫానులకు ప్రసిద్ధి చెందిన ఓఖోట్స్క్ సముద్రంలో అతను ఎలా జీవించగలిగాడో.. అతని సోదరుడు, మేనల్లుడు ఎలా మరణించాడో అతను వెంటనే వివరించలేకపోయాడు.

పిచుగిన్ రక్షించబడినప్పుడు అతని పడవ కమ్ చట్కా తీరానికి 11 నాటికల్ మైళ్ల దూరంలో ఓఖోత్స్క్ సముద్రం అవతలి వైపు వారి గమ్యస్థానం నుండి 1,000 కిలోమీటర్లు (సుమారు 540 నాటికల్ మైళ్ళు) దూరంలో ఉంది. లైఫ్ జాకెట్‌లో ఉన్న వ్యక్తి సహాయం కోసం అరుస్తున్నట్లు ఒక వీడియోలో కనిపించింది. పిచుగిన్‌ను మగడాన్ ఆసుపత్రిలో అత్యవసర విభాగానికి తరలించారు. అతను డీహైడ్రేషన్ తో బాధపడుతున్నాడని, అయితే అతని పరిస్థితి నిలకడగా ఉందని చీఫ్ డాక్టర్ యూరి లెడ్నెవ్ విలేకరులతో చెప్పారు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular