Delhi Husband Wife Case: లోకంలో సంసారాల్లో ఎన్నో వింతలు జరుగుతున్నాయి. భార్యాభర్తల మధ్య అపోహలు, అక్రమ సంబంధాలు, తాగుడు వ్యవసనాలతో కాపురాలు గుళ్ల అవుతున్నాయి. నూరేళ్లు కలిసుంటామని ప్రమాణం చేసుకున్న వారే మారుతున్న పరిస్థితుల్లో తమ మనసుల్లో వైరుధ్య భావాలు చోటుచేసుకునేలా చేస్తున్నాయి. దీంతో జీవిత భాగస్వామిని అవసరమైతే కడతేర్చాలని కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి కేసులు వెలుగు చూడటం గమనార్హం. అయినా మనుషుల్లో పరివర్తన రావడం లేదు. మససుల్లో మంచి భావనలు పొడచూపడం లేదని సమాచారం.
దక్షిణ ఢిల్లీలోని మైదాన్ గల్హీ ప్రాంతంలో సునీల్ కుమార్ (32) ఉంటున్నాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన రేఖ (35) (పేరు మార్చారు)లు వివాహం చేసుకున్నారు. రేఖ సునీల్ కుమార్ కంటే పెద్దదైనా ఎలాంటి అనుమానాలు లేకుండా వివాహం చేసుకోవడం గమనార్హం. మూడేళ్లుగా వారి కాపురం సజావుగానే సాగుతోంది. సునీల్ కుమార్ కు మందు తాగడం అలవాటు ఉంది. దీంతో ఇంట్లోనే మద్యం బాటిళ్లు ఉంచుకుని రోజూ మద్యం సేవించేవాడు.
Also Read: Vangaveeti Mohana Ranga: వంగవీటి మోహన్ రంగా ఎవరు? ఆయనకు ఎందుకంత క్రేజ్ అంటే?
కానీ తాను తీసుకొచ్చుకున్న మద్యం సీసాలు ఖాళీ అవడం చూస్తుంటే అతడికి అనుమానం వచ్చేది. ఒక దశలో మద్యం మత్తులో తనకేమీ తెలియడం లేదని అనుకునే వాడు కానీ పిల్లి ఎన్నిరోజులు తెలియకుండా పాలు తాగుతుంది. ఎప్పుడో ఒకప్పుడు తెలిసిపోతుంది కదా. ఇదే కోణంలో తన భార్యకు సైతం మద్యం తాగడం అలవాటు ఉందని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. దీంతో ఆమెను ఎలా కంట్రోల్ చేయొచ్చని ఆలోచించేవాడు. కానీ రానురాను ఆ అలవాటు తీవ్రంగా మారింది.
అంతే కాదు ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కూడా ఏర్పడింది. సునీల్ కుమార్ బయటకు వెళ్లిన సమయంలో ఆమె తన ప్రియుడితో కలిసి సరదాలు తీర్చుకునేది. దీనిపై కూడా సునీల్ కుమార్ కు ద్వేషం పెరిగింది. తన భార్య ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. ఏమైందో తెలియదు కానీ ఓ రోజు తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సునీల్ కుమార్ నే అనుమానించారు. అతడి కదలికలపై కన్ను వేశారు.
దీంతో వారు అనుమానించిందే నిజమైంది. సునీల్ కుమార్ భార్యను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తనకు సోదరుడు చోటు సహాయం చేసినట్లు వెల్లడించాడు. దీంతో పోలీసులు అతడి కోసం వెతుకులాట ప్రారంభించారు. అతడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. తన భార్యను అడవిలో మద్యం తాగించి అనంతరం హత్య చేసి పారేసినట్లు ఒప్పుకున్నాడు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Also Read:Uddhav Thackeray Resigns: మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవీస్.. ప్రజల్లోకి పాదయాత్రగా ఉద్దవ్ ఠాక్రే