Mama Mascheendra Teaser Review: సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్న బావ సుధీర్ బాబు కమిటెడ్ యాక్టర్. పాత్ర కోసం తనని తాను మార్చుకుంటాడు. కొందరికి ఎంత సప్పోర్ట్, టాలెంట్ ఉన్నా పైకి రాలేరు. సుధీర్ బాబు ఈ కోవకే చెందుతాడు. నటుడిగా ఎదగాలని ఆయనకు తపన ఉంది. ప్రయోగాత్మక చిత్రాలు, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటాడు. ఫలితం మాత్రం శూన్యం. టాలెంట్ ఉన్నా టైం కలిసి రావడం లేదు. సమ్మోహనం, నన్ను దోచుకుందువటే మంచి చిత్రాలుగా పేరు తెచ్చుకున్నాయి. కమర్షియల్ గా ఆడలేదు.
సుధీర్ గత రెండు చిత్రాలు వచ్చి పోయినట్లుగా కూడా తెలియదు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఓ చెత్త సినిమా. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హంట్ ని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఈసారి కమర్షియల్ ఎంటర్టైనర్ చేశారు. మామా మశ్చీంద్ర టైటిల్ తో తెరకెక్కిన చిత్రం త్వరలో విడుదల కానుంది. మామా మశ్చీంద్ర టీజర్ విడుదల కాగా ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రంలో సుధీర్ బాబు ట్రిపుల్ రోల్ చేశారు.
మూడు భిన్నమైన గెటప్స్ సుధీర్ బాబు కనిపిస్తున్నారు. ఇక బాడీ షేమింగ్, అమ్మాయిల సిక్స్ ప్యాక్ ఫాంటసీ ఆధారంగా మామా మశ్చీంద్ర తెరకెక్కించారని అర్థం అవుతుంది. హీరోయిన్స్ ఈషా రెబ్బా, మృణాళిని రవి క్యారెక్టర్స్ బోల్డ్ గా ఉన్నాయి. సిక్స్ ప్యాక్ సుధీర్ పొట్టేసుకుని డీ గ్లామర్ లుక్ లో షాక్ ఇచ్చాడు. ఆయన ఫ్యాట్ మాన్ గెటప్ చాలా సహజంగా ఉంది. మేకప్ ఆర్టిస్ట్ బాగా కష్టపడ్డారు.
ఇక ఈ చిత్రానికి రచయిత హర్షవర్ధన్ దర్శకుడు కావడం విశేషం. హర్షవర్ధన్ నటుడిగా కూడా రాణిస్తున్న విషయం విషయం తెలిసిందే. ఇటీవల హిట్ 2 మూవీలో ఆయన కనిపించారు. మామా మశ్చీంద్ర మూవీతో దర్శకుడిగా అదృష్టం పరీక్షించుంటున్నారు. ఆయన రాసిన డైలాగ్స్ క్యాచీగా ఉన్నాయి. ‘వేగం ఎక్కువైతే ఆగం అవుతవ్ కాకా’, ‘కిక్ కోసం ఉరికితే కక్కొస్తది’ లాంటి వన్ లైనర్స్ బాగున్నాయి. మొత్తంగా మామా మశ్చీంద్ర టీజర్ ఆకట్టుకుంది. సినిమా మీద అంచనాలు పెంచేసింది. మరి ఈ చిత్రమైనా సుధీర్ హిట్ దాహం తీరుస్తుందేమో చూడాలి.