Allu Arjun Instagram: ఇంస్టాగ్రామ్ లో కేవలం ఆమెని మాత్రమే ఫాలో అవుతున్న అల్లు అర్జున్

Allu Arjun Instagram: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మొదటి నుండి పాన్ ఇండియా లెవెల్ లో మంచి ఫేమ్ ఉంది.ఈ ఫేమ్ మరియు క్రేజ్ కేవలం పుష్ప సినిమా తో వచ్చింది కాదు, ఆర్య నుండే ఆయన ఇండియా వైడ్ ఫేమస్.అందుకే సోషల్ మీడియా లో అల్లు అర్జున్ కి ఉన్నంత ఫాలోయింగ్ మిగిలిన ఏ హీరో కి కూడా ఉండదు.ఎందుకంటే ఆయనని టాలీవుడ్ ఆడియెన్స్ తో పాటుగా బాలీవుడ్, కోలీవుడ్ మరియు మాలీవుడ్ […]

Written By: Vicky, Updated On : April 22, 2023 1:47 pm
Follow us on

Allu Arjun Instagram

Allu Arjun Instagram: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మొదటి నుండి పాన్ ఇండియా లెవెల్ లో మంచి ఫేమ్ ఉంది.ఈ ఫేమ్ మరియు క్రేజ్ కేవలం పుష్ప సినిమా తో వచ్చింది కాదు, ఆర్య నుండే ఆయన ఇండియా వైడ్ ఫేమస్.అందుకే సోషల్ మీడియా లో అల్లు అర్జున్ కి ఉన్నంత ఫాలోయింగ్ మిగిలిన ఏ హీరో కి కూడా ఉండదు.ఎందుకంటే ఆయనని టాలీవుడ్ ఆడియెన్స్ తో పాటుగా బాలీవుడ్, కోలీవుడ్ మరియు మాలీవుడ్ ఆడియన్స్ కూడా ఫాలో అవుతుంటారు.

ఇంస్టాగ్రామ్ లో ఆయనకీ 21 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు, మిగిలిన ఏ టాలీవుడ్ హీరో కి కూడా ఈ రేంజ్ ఫాలోయర్స్ లేరు.అలాగే ఫేస్ బుక్ లో అదే రేంజ్ ఫాలోయర్స్ ఉండగా, ట్విట్టర్ లో 6 మిలియన్ కి పైగా ఫాలోయర్స్ ఉన్నారు.అయితే ఫేస్ బుక్ లో కానీ, ట్విట్టర్ లో కానీ అల్లు అర్జున్ ఎవరినీ ఫాలో అవ్వట్లేదు.

కానీ ఇంస్టాగ్రామ్ లో మాత్రం కేవలం ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్నాడు.అది మరెవరో కాదు, ఆయన సతీమణి అల్లు స్నేహారెడ్డి.ఇంస్టాగ్రామ్ లో తన తమ్ముడు అల్లు శిరీష్ ఉన్నాడు, రామ్ చరణ్ మరియు మెగాస్టార్ చిరంజీవి వంటి వాళ్ళు కూడా ఉన్నారు.తన కుటుంబ సభ్యులు ఇంతమంది ఉన్నా కూడా కూడా అల్లు అర్జున్ ఎందుకు ఫాలో అవ్వడం లేదు, అసలు ఆయన ఉద్దేశ్యం ఏమిటి అనేది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న.అల్లు అర్జున్ ట్విట్టర్ లోకి వచ్చిన కొత్తల్లో తన తమ్ముడు అల్లు శిరీష్ ని , ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఫాలో అయ్యేవాడు.

Allu Arjun Instagram

కానీ కొన్ని రోజుల తర్వాత వీళ్ళ ముగ్గురుని కూడా అన్ ఫాలో కొట్టేసాడు.దాని అర్థం ఏంటో ఎవరికీ తెలియదు.ఇంటర్వ్యూస్ లో కూడా ఎవ్వరూ ఆయనని ఈ ప్రశ్న అడగరు.అయితే ఇంస్టాగ్రామ్ లో అల్లు అర్జున్ కి ఒక ప్రత్యేకమైన బ్యాకప్ ప్రైవేట్ అకౌంట్ ఉందని, అందులో నుండి ఆయన అందరిని ఫాలో అవుతాడని రూమ్మేట్ కూడా ఉంది.