Malaika Arora : ఆమె పేరు మలైక అరోరా (Malaika Arora). ఈ పేరు గూగుల్ లో టైప్ చేస్తే కొన్ని వందల పేజీల సమాచారం వస్తుంది. అన్ని పేజీల్లోనూ హాట్ హాట్ గా మలైకా అరోరా.. 51 సంవత్సరాల వయసులోనూ మల్లెతీగ లాగా.. భర్తకు విడాకులు ఇచ్చిన మలైక.. అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తున్న మలైక.. అర్జున్ కపూర్ కు బ్రేకప్ చెప్పిన మలైకా.. ఇలాంటి వార్తలు కుప్పలు తెప్పలు.. మలైకా అరోరా వయసు 51 సంవత్సరాలు.. ఇప్పటికీ ఆమె యోగా చేస్తుంది.. సన్నజాజి తీగలాగా కనిపిస్తుంది. గడ్డాలు, మీసాలు వచ్చిన కొడుకు ఉన్నప్పటికీ ఆమె యవ్వనిలాగే దర్శనమిస్తుంది. స్టేజ్ మీద “చల్ చయ్యా చయ్యా.. మున్ని బద్నాం హూయీ” పాటలు వినిపిస్తే చాలు తన వయసును కూడా మర్చిపోతుంది. కుర్రకారు కూడా ఆమెతో స్టెప్పులు వేయాలంటే భయపడేలా చేస్తుంది. అలాంటి మలైక ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది.. దీంతో కొద్దిరోజులుగా మలైకా గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది.
Also Read : ఆర్థిక ఇబ్బందుల్లో యాంకర్ ప్రదీప్..లేటెస్ట్ కామెంట్స్ వైరల్!
కొత్త బంధంలోకి..
మలైక అరోరా 90ల కాలంలోనే పెద్ద సెన్సేషన్.. హీరోయిన్ అంటే ఇలానే ఉండాలి అనే నిబంధనలకు ఉప్పు పాతర వేసిన నటి. షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఓ సినిమాలో చల్ చయ్యా చయ్యా అనే పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె ఎన్నడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈలోపు అర్భాజ్ ఖాన్ తో ప్రేమ, పెళ్లి.. ఓ కుమారుడు.. దశాబ్దానికి మించిన దాంపత్యం.. ఇన్నింటి మధ్య ఉన్నప్పటికీ మలైకా అరోరా తన కెరియర్ ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఫ్యాషన్ షోలో పాల్గొంటూనే ఉంది.. బాలీవుడ్ లో ప్రత్యేకమైన పాటల్లో నర్తిస్తూనే ఉంది.. హాయిగా సాగిపోతున్న సంసారంలో ఎక్కడో తేడా కొట్టింది. ఇంకేముంది భర్తతో దాంపత్య జీవితానికి బ్రేక్ పడింది. అన్ని సంవత్సరాల సంసార జీవితంలో ఎన్నడు లేని ఇబ్బంది అప్పుడే ఎదురు కావడం.. అది విడాకులకు దారి తీయడంతో మలైకా తట్టుకోలేకపోయింది. ఆ వేదనలో అర్జున్ కపూర్ సాంత్వన కలిగించాడు. దీంతో సహజంగానే అతడికి ఆమె దగ్గర అయింది. ఆ బంధం కొంతకాలం పాటు బాగానే సాగినప్పటికీ.. ఈ మధ్యనే అది కూడా బీటలు వారింది.
ఏ పురుషుడూ అర్థం చేసుకోలేదా?
సహజంగా మలైకా ప్రేమను ఏ పురుషుడు అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకునే పరిపక్వత వారికి లేదా? మీసాలు, గడ్డాలు వచ్చిన కుమారుడు ఉన్నప్పటికీ మలైకా ప్రేమ కోసం ఇంతగా ఎందుకు తపిస్తోంది? ప్రేమను పంచే ఆడవాళ్లు.. ప్రేమ లభించకపోతే ఇంతలా ఇబ్బంది పడతారా? ఏమో ఈ ప్రశ్నలకు మలైకాను అడిగితే..” ఒక స్త్రీ పరిపూర్ణంగానే ఉంటుంది. తన జీవితంలో ఎన్నో పాత్రలను పోషిస్తూ ఉంటుంది. ప్రేమను పంచే తనకు కూడా ప్రేమ కావాలి. ఒక తోడు ఉండాలి. బాధలో అండగా.. కష్టంలో తోడుగా.. సంతోషంలో అభినందన గా.. ఆనందంలో కృతజ్ఞతగా ఉండాలి. అవి లేకపోతే స్త్రీ ఉండలేదు. బహుశా దానికి నేను ఒక ఉదాహరణ కావచ్చు” అని మలైకా ఆమధ్య ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. అర్జున్ తో విడిపోయిన తర్వాత.. ఇప్పుడు క్రికెటర్ కుమార సంగక్కర కు దగ్గర అయిందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ జట్టు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆడిన ఐపీఎల్ మ్యాచ్ ను వారిద్దరు పక్కపక్కనే కూర్చుని చూశారు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో తెర వెనుక కీలకపాత్రను కుమార సంగక్కర పోషిస్తున్నాడు. అతడి వయసు కూడా 50 కి దగ్గరగానే ఉంది. అతని వైవాహిక జీవితం గురించి సెర్చ్ చేస్తుంటే.. వివాహం జరిగిందని.. విడాకులు తీసుకున్నాడని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఇన్నాళ్లకు మలైకా ఓ సరైన తోడు వెతుక్కుందని.. తన ప్రేమ రాహిత్యాన్ని అతడి స్థానం భర్తీ చేస్తుందని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి..
Also Read : ‘జై హనుమాన్’ లో ఇంత మంది హీరోలు ఉన్నారా? ప్లానింగ్ మాములుగా లేదుగా!