Jai Hanuman : గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘గుంటూరు కారం’ చిత్రాన్ని బాక్స్ ఆఫీస్ వద్ద డామినేట్ చేస్తూ ట్రేడ్ పండితులను సంభ్రమాశ్చర్యాలలోకి నెట్టేసిన చిత్రం ‘హనుమాన్'(Hanuman Movie). తెలుగు, తమిళం, హిందీ మరియు ఇతర భాషలకు కలిపి ఈ చిత్రానికి సుమారుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలాంటి సంచలనాత్మక చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్'(Jai Hanuman) చిత్రం ఉంటుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma) మొదటి భాగం లోని క్లైమాక్స్ షాట్ లోనే ఆడియన్స్ కు తెలుపుతాడు. ఈ సినిమా మొత్తం హనుమాన్ మీదనే ఉంటుంది. ఆ అద్భుతమైన క్యారక్టర్ లో ఎవరు నటించబోతున్నారు అనే దానిపై కూడా తెరపడింది. కాంతారా హీరో రిషబ్ శెట్టి(Rishab Shetty) ఇందులో ఆంజనేయ స్వామి క్యారక్టర్ లో కనిపించనున్నాడు. ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని కూడా విడుదల చేయగా, వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Also Read : ‘జై హనుమాన్’ మూవీ ఆగిపోయినట్టేనా..?అసలు ప్రశాంత్ వర్మ ఏం చేస్తున్నాడు..?
అంతే కాకుండా ఈ చిత్రం లో దగ్గుబాటి రానా(Rana Daggubati) ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఏ పాత్రలో కనిపిస్తాడు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కేవలం రానా మాత్రమే కాదు, ఈ చిత్రంలో మిగిలిన పాత్రల్లో కూడా పాన్ ఇండియా లెవెల్ లో గురింపు పొందిన సూపర్ స్టార్స్ నటించబోతున్నారని తెలుస్తుంది. శ్రీ రాముడి క్యారక్టర్ లో రామ్ చరణ్(Global Star Ram Charan) లేదా ప్రభాస్(Rebel Star Prabhas) కనిపించనున్నారని టాక్. అదే విధంగా ఈ చిత్రంలో భూమి మీద నివసిస్తున్న 7 మంది చిరంజీవులు కూడా కనిపిస్తారట. ఒక్కో చిరంజీవి క్యారక్టర్ లో ఒక్కో హీరో కనిపిస్తాడని టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన కీలక అప్డేట్ రానుంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వాస్తవానికి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ మొదటి సినిమాకు దర్శకత్వం వహించాల్సి ఉంది.
షూటింగ్ మొదలు అయ్యినట్టు గత ఏడాది మోక్షజ్ఞ కు సంబంధించిన లుక్ ని కూడా విడుదల చేసారు. కానీ ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ ఈ చిత్రం ఆగిపోయింది. భవిష్యత్తులో ఉంటుందా లేదా అనే విషయం పై కూడా క్లారిటీ లేదు. ‘జై హనుమాన్’ చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘బ్రహ్మ రాక్షస’ అనే సినిమా చేయనున్నాడు. బకాసురుడి జీవిత చరిత్ర ని ఆదర్శంగా తీసుకొని ఈ సినిమా తెరకెక్కుతుంది. తక్కువ బడ్జెట్ తో అద్భుతమైన ఔట్పుట్ ని రాబట్టే అలవాటు ఉన్న ప్రశాంత్ వర్మ, ఈసారి ఈ చిత్రం కోసం భారీగా బడ్జెట్ ని ఖర్చు చేయనున్నారు. ‘జై హనుమాన్’ చిత్రం కూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమానే. చూడాలి మరి రాబోయే రోజుల్లో ప్రశాంత్ వర్మ ఎంత రేంజ్ కి వెళ్లబోతున్నాడు అనేది.
Also Read : జై హనుమాన్ సినిమాలో హనుమాన్ గా నటిస్తున్న స్టార్ హీరో…