
Mahindra Thar SUV: ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా సంచలన రికార్డు సృష్టించింది. ఈ కంపెనీ నుంచి రిలీజైన థార్ SUV కీలక మైలురాయిని దాటేసింది. ఈ బ్రాండ్ రిలీజైన కేవలం రెండున్నరేళ్లలో 1,00,000 యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఈ మేరకు ఆ సంస్థ ఇటీవల వివరాలను ప్రకటించింది. మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి విడుదలయ్యే ప్రతి ఒక్క SUV లేదా MPV ఇప్పటి వరకు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇదే కోవలో అధునాతన SUV కూడా మార్కెట్లోకి వచ్చి సరికొత్త రికార్డు నెలకొల్పి అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది.
మహీంద్రా థార్ 2.0 లీటర్ 4 సిలిండర్ టర్భో పెట్రోల్ ను కలిగి ఉంది. 152 bhp పవర్, 300 Nm టార్క్, 132 బీహెచ్ పీ పవర్, 300 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్ష్ ఆప్షన్లు ఉన్నాయి. వీటితో పాటు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఉంది. ఇది 117 bhp పవర్, 300 Nm టార్క్ ను కలిగి ఉంది. అయితే RWD మోడల్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. తక్కువ శక్తిగల డీజిల్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్ష్ ఉన్న 2WD సిస్టమ్ ను కలిగి ఉండి ఆకర్షిస్తోంది.
మహీంద్రా థార్ SUV మార్కెట్లోకి వచ్చి 2.5 ఏళ్లు అవుతోంది. అయితే తక్కవ వ్యవధిలోనే 1,00,000 యూనిట్లు ఉత్పత్తి చేసి సంచలనం సృష్టించించింది. 2020 అక్టోబర్ లో అప్డేట్ వర్సెన్ తో రిలీజైన ఈ మోడల్ ఇప్పటి వరకు ఎన్నో అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. దీని పనితీరు చూసి చాలా మంది కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో SUV ఎవర్ గ్రీన్ గా నే ఉంటోంది. దేశంలో SUVలపై పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని మహీంద్రా ఆప్ రోడింగ్ సామర్థ్యాలు, స్పోర్టీ డిజైన్ లాంగ్వేజ్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది.

ఆఫ్ రోడింగ్ అడ్వెంచర్ల కోసం వెతుకున్న వారి కోసం 4X4 SUV వేరియంట్ అందుబాటులో ఉంది. బలమైన డ్రైవ్ బ్రెయిన్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్, పిఫ్ట్-ఆన్-ది-ఫ్లై ట్రాన్ష్ ఫర్ కేస్ వంటి అప్డేట్ ఫీచర్లను కలిగి ఉంది. హైవేసై సౌకర్యవంతంగా ప్రయాణించాలనుకునేవారికి కోసం ఈ వెహికిల్ చాలా ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మార్చి 26న ఢిల్లీలో జరిగిన ఛాంపియన్ షిప్ లో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ కు మహీంద్రా థార్SUVని బహుమతిగా ఇచ్చారు.