Namrata Shirodkar: మహేష్ వైఫ్ నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. ఆమె తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. నేడు నితిన్ శిరోద్కర్ వర్ధంతి. ఈ సందర్భంగా నమ్రత తండ్రి మృతిని గుర్తు చేసుకుని బాధపడ్డారు. మీరు దూరమై 16 ఏళ్ళు అవుతుంది. ఎలాంటి మార్పు రాలేదు. మీ జ్ఞాపకాలు స్పష్టంగా మదిలో అలానే నిలిచిపోయాయి. త్వరగా వెళ్లిపోయారు నాన్న… అని కామెంట్ చేశారు. ఫాదర్ ఫోటో షేర్ చేశారు. ముంబైలో పుట్టిపెరిగిన నమ్రత మోడలింగ్ ని కెరీర్ గా ఎంచుకున్నారు. కూతురి కలను నితిన్ శిరోద్కర్ ప్రోత్సహించారు. ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్, ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ టైటిల్స్ ఆమె గెలిచారు.

మిస్ యూనివర్స్ పోటీలో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించారు. 5వ ప్లేస్ పొందారు. అనంతరం హీరోయిన్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టారు. తెలుగులో నమ్రత కేవలం రెండు సినిమాలు మాత్రమే చేశారు. చిరంజీవి సోషియో ఫాంటసీ చిత్రం అంజితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ మూవీ డిలే అయ్యింది. మహేష్ తో చేసిన వంశీ మొదట విడుదలైంది. వంశీ మూవీ సెట్స్ లో నమ్రత-మహేష్ ల మధ్య లవ్ మొదలైంది.
ఐదేళ్లుగా ప్రేమించుకున్న మహేష్-నమ్రత 2005లో రహస్య వివాహం చేసుకున్నారు. కేవలం కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా మహేష్-నమ్రతల వివాహం జరిగింది. 17 ఏళ్ల కాపురంలో అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. వీరికి గౌతమ్-సితార సంతానం. పెళ్లి తర్వాత నమ్రత యాక్టింగ్ కి గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం ఆమె మహేష్ కి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మహేష్ అనధికారిక మేనేజర్.

గత ఏడాది మహేష్ కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. జనవరిలో మహేష్ అన్నయ్య రమేష్ బాబు మరణించారు. సెప్టెంబర్ నెలలో అమ్మ ఇందిరాదేవి, నవంబర్ లో తండ్రి కృష్ణ కన్నుమూశారు. నెలలు, రోజుల వ్యవధిలో కుటుంబ సభ్యులను కోల్పోయిన మహేష్ తీవ్ర వేదనకు గురయ్యారు. కోలుకున్న మహేష్ ఎస్ఎస్ఎంబి 28 షూటింగ్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
View this post on Instagram