Mahesh Babu: మహేష్-త్రివిక్రమ్ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల మొదలైంది. ఇప్పటికే షూటింగ్ ఆలస్యం కావడంతో త్రివిక్రమ్ త్వరితగతిన పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. నిరవధికంగా షెడ్యూల్స్ ప్లాన్ చేశారట. ఈ ఏడాది చివర్లో మహేష్ మూవీ విడుదల కానుందట. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్టులోనే థియేటర్స్ లో దిగొచ్చు అంటున్నారు. నిజానికి 2023 సమ్మర్ కానుకగా విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడది సాధ్యమయ్యే వ్యవహారం కాదు. మరోవైపు రాజమౌళి చిత్రానికి ఆయన సిద్ధం కావాలి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేస్తున్న రాజమౌళి సమ్మర్ లో మహేష్ మూవీ సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

కాగా 13 ఏళ్ల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబో సెట్ అయ్యింది. 2010లో ఖలేజా విడుదలైంది. మళ్ళీ ఇన్నేళ్లకు పెన్ను-గన్ను కాంబో సెట్ అయ్యింది. అందుకే ఎస్ఎస్ఎంబి 28 ఫ్యాన్స్ కి చాలా ప్రత్యేకం. అందులోను ఇది హ్యాట్రిక్ మూవీ. అలాగే హీరోయిన్ పూజాతో కూడా త్రివిక్రమ్ కి హ్యాట్రిక్ చిత్రం. ఇలా పలు ప్రత్యేకతలు ఈ ప్రాజెక్ట్ కి ఉన్నాయి.
మహేష్-త్రివిక్రమ్ మూవీ జోనర్ పై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మెజారిటీ వర్గాల సమాచారం ప్రకారం ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అట. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కమర్షియల్ చిత్రాలు తెరకెక్కించడంతో త్రివిక్రమ్ దిట్ట. ఆయన కెరీర్లో బ్లాక్ బస్టర్స్ అన్ని ఈ జోనర్లో రూపొందినవే. కాబట్టి ఈ చిత్ర విజయంపై మహేష్ ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ఆయన గత చిత్రం అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ కొట్టింది.

అనూహ్యంగా అధికారిక విడుదలకు ముందే మహేష్ లుక్ లీకైంది. మహేష్ చెక్స్ షర్ట్ ధరించి తలకు రెడ్ కర్చీఫ్ కట్టుకొని మాస్ లుక్ లో దర్శనమిచ్చారు. మహేష్ కెరీర్లో బ్లాక్ బస్టర్స్ గా ఉన్న పోకిరి, శ్రీమంతుడు చిత్రాల లుక్స్ మహేష్ గుర్తు చేశాడు. దీంతో మహేష్ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. మహేష్ లుక్ పట్ల ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
సూర్యదేవర నాగవంశీ ఈ చిత్ర నిర్మాతగా ఉన్నారు. ఎస్ఎస్ఎంబి 28 చిత్ర డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకుందట. అన్ని భాషలు కలిపి కేవలం డిజిటల్ రైట్స్ కి రూ. 80 కోట్లు చెల్లించారని టాలీవుడ్. అంటే బడ్జెట్ తో యాభై శాతానికి పైగా ఓటీటీ రైట్స్ తో రికవరీ చేశారు.