Transgender Marriage: దేశంలో యువత ట్రాన్స్ జెండర్స్‌కు ఆకర్షితమవుతోంది. ప్రేమ పేరుతో కలిసి తిరుతున్నారు. తర్వాత పెళ్లి వరకూ వెళ్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఓ ట్రాన్స్ జెండర్‌ను పెళ్లిచేసుకున్నాడు ఓ యువకుడు. దీంతో కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నాడు.

ట్రాన్స్ జెండర్ ప్రేమలో అమృత్‌సర్ యువకుడు..
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌కు చెందిన అర్జున్ అనే యువకుడికి రవి అనే ట్రాన్స్‌జెండర్‌తో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. క్రమంగా ఈ స్నేహం ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఇద్దరూ ప్రేమలో పడ్డాడు. కలిసి తిరిగారు. దీనిని అందరూ సాధారణ స్నేహంగానే చూసి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. దీంతో ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లి కలిసి జీవించాలనుకున్నారు.
అమ్మాయిగా మారిన ట్రాన్స్ జెండర్..
తమ ప్రేమను పెళ్లిగా మార్చుకునేందుకు రవి ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారాడు. తన పేరును మీన్ రియాగా మార్చుకున్నాడు. అనంతరం వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరు ఒక పాపను దత్తత తీసుకుని ఆనందంగా గడుపుతున్నారు.

కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు..
సాఫీగా సాగుతున్న వీరి జీవితంలోకి ఇప్పుడు రియా కుటుంబం ఎంటర్ అయింది. పెళ్లి కోసం అమ్మాయిగా మారినందుకు వేధిస్తున్నారు. వారి బంధాన్నే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల భోగి పండుగ రోజు తన కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి తమను ఇష్టానుసారం తిట్టారని, కొట్టారని అర్జున్ ఆరోపించాడు. వేధింపులు ఆపకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరిస్తున్నాడు.
ప్రకృతి విరుద్ధమైన బంధం..
అర్జున్, రవిది ప్రకృతి విరుద్ధమైన బంధమే అయినా వారు ఎవరికీ ఇబ్బందిగా మారలేదు. పైగా పాపను దత్తత తీసుకుని జీవిస్తున్నారు. సాఫీగా, ఎవరికీ అభ్యంతరం లేకుండా సాగుతున్న వారి జీవనంపై బంధువుల అభ్యంతరమే ఇప్పుడు వారికి సమస్యగా మారింది. మరి ఇంతటితో అయినా వేధింపులు ఆగుతాయా, పోలీసుల వరకు వెళ్తుందా అన్నది వేచి చూడాలి.