https://oktelugu.com/

ఆ‘రేంజ్‌ ఆర్మీ’.. లాస్ట్ పంచ్ లో సన్ ‘రైజర్స్’

ప్లే ఆఫ్స్‌కు చేరడమే లక్ష్యంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో డూ ఆర్‌‌ డై మ్యాచ్‌ ఆడిన ఆరేంజ్‌ గ్యాంగ్ గురువారం దుమ్మురేపింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అటు బౌలింగ్‌లో.. ఇటు బ్యాటింగ్‌లో తన దైన శైలిలో విరుచుకుపడింది. చివరకు ప్లేఆఫ్స్‌ ఆశలను సజీవం చేసుకుంది. Also Read: గబ్బర్‌‌ ది గ్రేట్‌.. ధావన్ వరుస సెంచరీల రికార్డ్ రాజస్థాన్‌ రాయల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా రాజస్థాన్‌ బ్యాటింగ్‌కు దిగింది. 6 వికెట్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 23, 2020 3:30 pm
    Follow us on

    Sunrisers Hyderabad beat Rajasthan Royals

    ప్లే ఆఫ్స్‌కు చేరడమే లక్ష్యంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో డూ ఆర్‌‌ డై మ్యాచ్‌ ఆడిన ఆరేంజ్‌ గ్యాంగ్ గురువారం దుమ్మురేపింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అటు బౌలింగ్‌లో.. ఇటు బ్యాటింగ్‌లో తన దైన శైలిలో విరుచుకుపడింది. చివరకు ప్లేఆఫ్స్‌ ఆశలను సజీవం చేసుకుంది.

    Also Read: గబ్బర్‌‌ ది గ్రేట్‌.. ధావన్ వరుస సెంచరీల రికార్డ్

    రాజస్థాన్‌ రాయల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా రాజస్థాన్‌ బ్యాటింగ్‌కు దిగింది. 6 వికెట్లు తీసి.. 154 పరుగులకే సన్‌రైజర్స్‌ టీం కట్టడి చేసింది. ఆ తర్వాత బ్యాంటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో త్వరగానే పెవిలియన్ చేరినప్పటికీ.. మనీష్ పాండే (83 నాటౌట్), విజయ్ శంకర్ (52 నాటౌట్) మూడో వికెట్‌కు 140 పరుగులు జోడించి సన్‌రైజర్స్‌ను గెలిపించారు.

    సన్‌రైజర్స్ తరఫున ఇది 24వ శతక భాగస్వామ్యం కాగా.. ఆరెంజ్ ఆర్మీలో ఇద్దరు భారత బ్యాట్స్‌మెన్ శతక భాగస్వామ్యం నెలకొల్పడం ఇదే మొదటి సారి. 2013లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో పార్థివ్ పటేల్, శిఖర్ ధావన్ తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. రాజస్థాన్‌తో మ్యాచ్‌ ముందు వరకూ సన్‌రైజర్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ నమోదు చేసిన అత్యధిక భాగస్వామ్యం ఇదే. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో పాండే, విజయ్ శంకర్ జోడీ ఈ రికార్డును బ్రేక్ చేసింది.

    Also Read: మూడు సూపర్ ఓవర్లు.. ఐపీఎల్ నరాలు తెంపేసింది..

    అయితే.. సన్‌రైజర్స్‌ ఎక్కువగా టాప్ ఆర్డర్‌పై ఆధారపడుతోంది. గతంలో వార్నర్-–ధావన్.. ఇప్పుడు వార్నర్–-బెయిర్‌స్టో జట్టుకు శుభారంభాలు ఇస్తున్నారు. నాలుగో స్థానంలో కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో భారత క్రికెటర్లలో మూడో స్థానంలో ఆడే మనీష్ పాండేకు మాత్రమే ఎక్కువ ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటోంది. గాయం కారణంగా విలియమ్సన్ రాజస్థాన్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో విజయ్ శంకర్‌ను నాలుగో స్థానానికి ప్రమోట్ చేశారు. అటు బౌలింగ్‌లోనూ జేసన్‌ హోల్డర్‌‌ 4 ఓటర్లలో 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఉతప్పను రనౌట్‌ చేశాడు. మొత్తంగా ఆరేంజ్‌ ఆర్మీ ఆల్‌రౌండ్‌ ప్రతిభ కనబరిచి మరోసారి తిరుగులేదని నిరూపించింది. మున్ముందు జరిగే మ్యాచ్‌ల్లోనూ ఇదే ప్రతిభ కొనసాగిస్తే ఫైనల్‌ చేరడం పెద్ద కష్టం కాదేమో..!