టాలీవుడ్ కు ఈ ఇద్దరు స్టార్ హీరోలు రెండు కళ్లు లాంటివారు.. అగ్రహీరోల్లో అత్యంత ప్రజాదరణ ఉన్న వారు ఎవరయ్యా అంటే అది పవన్ కళ్యాణ్, మహేష్ బాబులే. ఫ్యాన్స్ వీరి విషయంలో విడిపోయి తమ హీరోనే గొప్ప అని ప్రచారం చేసుకున్నా.. వ్యక్తిగతంగా మాత్రం వీరిద్దరూ ఒకటే.
పవన్ కళ్యాణ్ వరుస ఫ్లాపులతో సతమతమైన రోజుల్లో త్రివిక్రమ్ తీసిన ‘జల్సా’ మూవీకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చి ప్రమోషన్ లో పాలుపంచుకున్నారు. అలాగే మహేష్ బాబు సినిమాలకు పాజిటివ్ గా పవన్ స్పందించారు. వీరిద్దరి మధ్య స్నేహం ఆనాటి నుంచి ఉంది.
ఇక బాక్సాఫీస్ వద్ద మాత్రం ఇద్దరూ హీరోలు పోటీపడిన సందర్భాలున్నాయి. కోట్ల కలెక్షన్ల వేటలో తలపడ్డారు. ఈ రాబోయే సంక్రాంతికి కూడా పవన్ ‘భీమ్లా నాయక్’, మహేష్ ‘సర్కారివారి పాట’తో తలపడుతున్నారు. అయితే సినిమాల్లో పోటీతత్వం వేరు.. వారి వ్యక్తిగత స్నేహం మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది.
తాజాగా నిన్న పవన్ కళ్యాణ్ ‘రిపబ్లిక్ ’ మూవీ ప్రీరిలీజ్ వేడుకలో చేసిన ప్రసంగం సినీ, రాజకీయవర్గాలను షేక్ చేసింది. పవన్ అగ్రెసివ్ స్పీచ్ తో అంతా దద్దరిల్లింది. ఈ క్రమంలోనే పవన్ మాట్లాడిన స్పీచ్ పై అప్పుడెప్పుడో 2010లో మహేష్ చేసిన ట్వీట్ ను జతచేసి అభిమానులు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.
‘ఎవరో చెప్తే విన్నాను నిన్న పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్ లో చాలా మాట్లాడాడు అని.. అది విని నేనేమీ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే అతను నేను బాగా ఇష్టపడే వ్యక్తి’ అని మహేష్ బాబు 2010లో ట్వీట్ చేశాడు. పదేళ్ల క్రితం ట్వీట్ అయినా కూడా నిన్నటి పవన్ ప్రసంగానికి బాగా సూట్ కావడంతో ఫ్యాన్స్ ఇప్పుడు ఈ పాత మహేష్ ట్వీట్ ను వైరల్ చేస్తున్నారు.
sum1 mentioned d other day that pawan spoke really well at d audio function.I wasn't surprised:)he's sum1 who I'm really fond of.
— Mahesh Babu (@urstrulyMahesh) July 12, 2010